News May 19, 2024
వామ్మో.. ముంబై రోడ్డుపై ప్రయాణమా..!

నెల్లూరు-ముంబై రహదారి ప్రమాదాలకు కేరాఫ్గా మారింది. బుచ్చిరెడ్డిపాళెం, సంగం, ఆత్మకూరు, మర్రిపాడు మండలాల పరిధిలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలోనే ఎందరో ప్రాణాలు కోల్పోయారు. పలు ప్రమాదాలకు ఆగి ఉన్న వాహనాలే కారణమవుతున్నాయి. వరుస ప్రమాదాలు జరుగుతున్నా భద్రతా పరమైన చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Similar News
News November 4, 2025
అంబేడ్కర్ స్టడీ సర్కిల్ ద్వారా నీట్ విద్యార్థులకు ఉచిత శిక్షణ

విజయవాడలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ స్టడీ సర్కిల్ ద్వారా నీట్ విద్యార్థులకు ఉచిత శిక్షణ అందజేయనున్నట్లు జిల్లా సంబంధిత శాఖ సమన్వయ అధికారిణి డాక్టర్ సి. ప్రభావతమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.
News November 4, 2025
నెల్లూరు: సగం బిల్లే ఇచ్చారని TDP నాయకుడి ఆవేదన

గుడ్లూరు(M) చినలాటరపికి చెందిన TDP నాయకుడు మల్లికార్జున ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం హల్చల్ చేశారు. 2014-19 మధ్య చేసిన పనులకు రూ.10 లక్షల బిల్లులు ఆగిపోయాయని, తాజాగా రూ.3.5 లక్షలే విడుదల చేశారని చెప్పారు. మిగిలినవి ఇవ్వకపోతే పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాధాన్యక్రమంలో బిల్లులు చెల్లిస్తామని MPDO తెలిపారు.
News November 4, 2025
నెల్లూరు: బీటెక్ చదివి దొంగతనాలు

నెల్లూరులో నిన్న ఓ <<18189275>>దొంగ పట్టుబడిన <<>>విషయం తెలిసిందే. అల్లూరు(M) జమ్మిపాలేనికి చెందిన శ్రీనాథ్ 2009లో బీటెక్(సివిల్) పూర్తి చేశాడు. ప్రస్తుతం నెల్లూరులోని ఓ థియేటర్లో పనిచేస్తున్నాడు. ఆన్లైన్ క్యాసినో ఆడుతూ జీతం మొత్తం దానికే పెడుతున్నాడు. ఈజీ మనీకి అలవాటు పడి చైన్ స్నాచింగ్, బైకుల దొంగతనాలు మొదలు పెట్టాడు. గతనెల 23న చాకలి వీధిలో జరిగిన కేసులో దొరకగా.. 7బైకులు, రెండు చైన్లు రికవరీ చేశారు.


