News March 28, 2025
వారంలో KBR పార్క్ చుట్టూ ఫ్లై ఓవర్‌లకు టెండర్లు

కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లను నిర్మించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ మేరకు రూ.1,090 కోట్లతో టెండర్లను ఆహ్వానించింది. మెగా, ఎన్సీసీ, ఎంవీఆర్ సంస్థలు టెండరు దక్కించుకునేందుకు పోటీపడ్డాయి. ఇటీవల ఈ కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. మరో వారం రోజుల్లో టెండర్ ఎవరికి కేటాయించాలనే విషయం స్పష్టత వస్తుంది. ఆ తర్వాతే ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు పేర్కొన్నారు.
Similar News
News April 6, 2025
స్టేషన్ ఘనపూర్: విద్యుత్ షాక్‌తో బీపీఎం మృతి

స్టేషన్ ఘనపూర్ మండలం మీదికొండలో బీపీఎంగా పని చేస్తున్న బోడావుల నాగదుర్గ బాలాజీ (26) విద్యుత్ షాక్‌తో మృతి చెందినట్లు సీఐ వేణు తెలిపారు. ఏపీలోని ఏలూరు జిల్లా కైకలూరు మండలం నర్సాయపాలెం గ్రామానికి చెందిన బాలాజీ 15 నెలల క్రితం మీదికొండలో పోస్టుమాస్టర్‌గా విధుల్లో చేరాడు. స్టేషన్ ఘనపూర్‌లో నివాసం ఉంటున్న ఆయన నీళ్ల కోసం మోటార్ ఆన్ చేయగా విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు సీఐ చెప్పారు.
News April 6, 2025
ధోనీ వేగంగా ఆడేందుకే చూశారు.. కానీ: కోచ్ ఫ్లెమింగ్

నిన్న రాత్రి CSKvsDC మ్యాచ్‌లో ధోనీ 26 బంతులాడి 30 పరుగులే చేయడంతో జట్టు గెలవాలన్న కసి లేకుండా ఆడారంటూ ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. వాటి గురించి ఆ టీమ్ కోచ్ ఫ్లెమింగ్ స్పందించారు. ‘గెలవాలన్న కసితోనే ధోనీ ఆడారు. కానీ మా బ్యాటింగ్ సమయానికి పిచ్ బాగా నెమ్మదించింది. ఆ ఆట చూడటానికి కష్టంగానే అనిపిస్తుంది కానీ అక్కడ ఆడేవారికి పిచ్ మరింత కష్టంగా ఉంది’ అని పేర్కొన్నారు.
News April 6, 2025
VKB: షాపింగ్ మాల్‌పై మహిళా సంఘ నేతల ఫిర్యాదు

మహిళలకు రూ.9 చీర ఇస్తామని మోసం చేసిన జేఎల్ఎం షాపింగ్ మాల్ పైన చర్యలు తీసుకోవాలని వికారాబాద్ పోలీస్ స్టేషన్‌లో ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి గీత ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ.. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు ఎండలో నిలబెట్టి కనీస సౌకర్యాలు వాళ్లకు కల్పించకుండా మహిళలను అవమానపరచారన్నారు. పట్టణ కేంద్రంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారని అన్నారు.