News August 24, 2024
వారం రోజుల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి: విశాఖ కలెక్టర్
విశాఖ జిల్లాలో గల అన్ని పరిశ్రమలలో వారం రోజుల్లోగా సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశించారు. విశాఖ కలెక్టరేట్ లో పరిశ్రమల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్మికుల, ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ పరిశ్రమలను నిర్వహించాలన్నారు. నిర్వాహకులు లోటుపాట్లను గుర్తించి సరి చేయాలన్నారు. వచ్చే నెల 30వ తేదీలోగా అన్ని చోట్ల మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు.
Similar News
News September 9, 2024
అనకాపల్లి: 1,528 హెక్టార్లలో నష్టం..!
భారీ వర్షాలకు అనకాపల్లి జిల్లాలో 4,420 మంది రైతులకు సంబంధించిన 1,528 హెక్టార్లలో వరి పంట నీట మునిగినట్లు జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రావు తెలిపారు. పొలాల్లో నీరు బయటకు పోయిన తర్వాత ఎకరం విస్తీర్ణం వరి పొలంలో 20 కిలోల యూరియా, 20 కిలోల పొటాష్ ఎరువులు వేయాలన్నారు. చీడపీడలు సోకకుండా గ్రాము కార్బండిజం పొడిని లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు.
News September 9, 2024
పాడేరు: రేపు కూడా సెలవు
అల్లూరు జిల్లాలో మంగళవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం కూడా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీలకు సెలవు వర్తిస్తుందని చెప్పారు.
News September 9, 2024
కైలాసగిరిపై ప్రమాదం… క్షతగాత్రులకు సీపీ పరామర్శ
విశాఖ కైలాసగిరిపై ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. బస్సులో ప్రయాణిస్తున్న 18 మంది వరకు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. వారిని కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.