News February 10, 2025

వారికి శాశ్వతంగా ఉచిత విద్యుత్: ఎమ్మెల్యే బొండా ఉమ

image

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు శాశ్వతంగా ఉచిత విద్యుత్ అందించేందుకు టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమ సోమవారం ట్వీట్ చేశారు. ఈ మేరకు 20.10 లక్షల ఎస్సీ, ఎస్టీల కుటుంబాలకు ప్రభుత్వమే ఉచితంగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. ఒక్కో ఇంటిపై 2 కిలోవాట్ల సౌరశక్తి ఉత్పత్తయ్యేలా పలకలు ఏర్పాటు చేశామని బొండా Xలో వెల్లడించారు.

Similar News

News February 26, 2026

ప్రొద్దుటూరులో నేడు బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో గురువారం బంగారం, వెండి ధరల వివరాలు:
*24 క్యారెట్ బంగారం 1 గ్రాము ధర రూ.15,730
*22 క్యారెట్ బంగారం 1 గ్రాము ధర రూ.14,472
*వెండి 10 గ్రాముల ధర రూ.2,720 గా ఉంది.

News February 26, 2026

ఫిబ్రవరి 28న బిక్కవోలు జాబ్ మేళా

image

బిక్కవోలులోని శ్రీ ప్రజ్ఞ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఫిబ్రవరి 28న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీశ్ చంద్ర ప్రసాద్ గురువారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని చెప్పారు. టెన్త్, ITI, డిప్లొమా, ఏదైనా డిగ్రీ పూర్తిచేసి 19-30 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులన్నారు.

News February 26, 2026

భారత్ నేరుగా సెమీస్‌ చేరాలంటే..

image

T20WC: నేడు వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా గెలిస్తే 4 పాయింట్లతో ఆ జట్టు సెమీస్‌లోకి అడుగుపెడుతుంది. అదే సమయంలో INDకు కొంత మేలు జరుగుతుంది. భారత్.. జింబాబ్వే, వెస్టిండీస్‌లను ఓడిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం కూడా నేరుగా సెమీస్‌కు వెళ్తాం. ఒకవేళ ఇవాళ WI గెలిస్తే సౌతాఫ్రికా జింబాబ్వే చేతిలో ఓడిపోవాలి. దాంతోపాటు మనం భారీ తేడాతో జింబాబ్వే, WIపై గెలిచి విండీస్ NRRను దాటాల్సి ఉంటుంది.