News March 28, 2025

వారిని ఓబీసీ జాబితాలో చేర్చేందుకు కృషి: కేంద్రమంత్రి రామ్మోహన్ 

image

ఆంధ్రప్రదేశ్‌లోని శిష్టకరణం, కళింగ కోమటి, తూర్పు కాపు, సోండీ, అరవల కులాలను కేంద్రీయ వెనుకబడిన వర్గాల (ఓబీసీ) జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇప్పటికే జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్‌కి సిఫారసు చేశారు. గురువారం కేంద్ర సామాజిక న్యాయ శాఖామంత్రి వీరేంద్ర కుమార్‌తో భేటీ అయి వినతి పత్రం సమర్పించారు. వీరిని ఓబీసీలో చేర్చే విషయాన్ని పరిశీలించాలన్నారు.

Similar News

News April 22, 2025

శ్రీకాకుళం: ఎస్పీ గ్రీవెన్స్‌కు 79 వినతలు

image

ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి వచ్చే వినతులు పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఏఎస్పీ కెవి రమణ పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు అర్జీలు అందజేశారు. తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. మొత్తం 79 అర్జీలు వచ్చినట్లు చెప్పారు.

News April 21, 2025

ఎచ్చెర్ల: డిగ్రీ ఆరవ సెమిస్టర్ ఇంటర్న్‌షిప్ ఫలితాలు విడుదల

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ ఆరవ సెమిస్టర్ ఇంటర్న్‌షిప్ ఫలితాలను నేడు యూనివర్సిటీ డీన్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ..ఈ ఫలితాలను https://jnanabhumi.ap.gov.in/ వెబ్ సైట్‌లో చూడాలని చెప్పారు. డిగ్రీ రెండవ సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్ 24వ తేదీ నుంచి జరుగుతాయని తెలిపారు.

News April 21, 2025

శ్రీకాకుళం: కలెక్టర్ గ్రీవెన్స్‌కు 154 వినతులు

image

ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకాకుళం జడ్పీ కార్యాలయం వేదికైంది. సోమవారం జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో “మీ కోసం” కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, జిల్లా పరిషత్ సీఈవో శ్రీధర్ రాజా తదితర అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుంచి మొత్తం 154 దరఖాస్తులు స్వీకరించారు. వాటిలో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు.

error: Content is protected !!