News October 30, 2024
వారిని కట్టడి చేద్దాం: HYD సీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని HYD సీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు. మంగళవారం బంజరాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ ఆఫీస్‌లో ఆయన అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. నగర పరిధిలో ఆశ్రయం లేని వ్యక్తుల్లో కొందరికి మానసిక స్థితి సరిగా లేదని, వారు మతపరమైన ప్రదేశాల వద్దకు వెళ్లి దాడులు చేస్తున్నారని, వారిని కట్టడి చేయాలన్నారు.
Similar News
News November 5, 2024
HYD: మహిళపై ముగ్గురి అత్యాచారం
అమీర్‌పేట్: మధురానగర్ PS పరిధిలో దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఇళ్లలో పనికి వెళ్లే ఓ మహిళ నిన్న కొండాపూర్‌లో పనికెళ్లి తిరిగొస్తుండగా ఆటోలో ముగ్గురు వచ్చి తమ గదిలో బట్టలు ఉతకాలని చెప్పి ఆమెను తీసుకెళ్లి రూమ్‌లో బంధించారు. నోట్లో బట్టలు కుక్కి, తీవ్రంగా కొట్టి ఆమెపై అత్యాచారం చేశారు. తప్పించుకున్న ఆమె దుస్తులు లేకుండా బయటకు రాగా పక్కింటి మహిళ గమనించి నైటీ ఇచ్చారు. కేసు నమోదైంది.
News November 5, 2024
నేడు కాచిగూడలో రాష్ట్ర స్థాయి బీసీ విద్యార్థి సదస్సుకు
కాచిగూడలోని అభినందన్ గ్రాండ్లో నేడు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి బీసీ విద్యార్థుల సదస్సుకు భారీ ఏర్పాట్లు చేశారు. కాచిగూడ పరిసర ప్రాంతాలను రాత్రింబవళ్లు విద్యార్థులు కష్టపడి బీసీ జెండాలతో అలంకరించారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ అధ్యక్షతన ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు.
News November 5, 2024
HYD: రేపటి నుంచి సర్వే.. ఇవి దగ్గర ఉంచుకోండి!
సమగ్ర ఇంటింటి సర్వే రేపటి నుంచి ప్రారంభం కానుంది. 56 ప్రధాన, 19 అనుబంధ మొత్తం కలిపి 75 ప్రశ్నలుంటాయి. ఆధార్ కార్డులు, రైతులయితే అదనంగా ధరణి పాసుపుస్తకాలు, రేషన్ కార్డు, ఇంటి పన్ను రసీదు దగ్గర పెట్టుకుంటే సర్వే సులువుగా పూర్తవుతుంది. సర్వేలో ఫొటోలు తీయడం, పత్రాలు అడగం వంటివి చేయరు. సేకరించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు.