News March 10, 2025
వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తాం: విశాఖ సీపీ

విశాఖ సీపీ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్, సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వచ్చిన సమాచారంతో అల్లిపురానికి చెందిన ప్రధాన నిందితుడు నానాబల్ల గణేశ్వరరావును ఆదివారం అరెస్ట్ చేశారు. ఇతను మధ్యవర్తిగా బెట్టింగ్ లావాదేవీలు జరపుతుంటాడని పేర్కొన్నారు. వీరి ద్వారా ఇంకొందరు బుకీల సమాచారం వెలుగులోకి వచ్చిందని వారిని త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు.
Similar News
News March 10, 2025
’50 శాతం స్థానాలు ఓబీసీలకు కేటాయించాలి’

దేశ జనాభాలో ఓబీసీల సంఖ్య 50 శాతానికి మించి ఉన్నందున, మొత్తం పార్లమెంటు స్థానాలలో 50 శాతం ఓబీసీలకు కేటాయించాలని బీసీ సంఘం ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు భోగి రమణ డిమాండ్ చేశారు. డాబాగార్డెన్స్లోని విజెఎఫ్ ప్రెస్ క్లబ్లో ఛలో ఢిల్లీ పోస్టర్ను ఆవిష్కరించారు. జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ఆదేశాల మేరకు ఈనెల 12,13 తేదీలలో న్యూఢిల్లీలో ఓబీసీ మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం ఉందని తెలిపారు.
News March 10, 2025
విశాఖలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు

విశాఖలో డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆసుపత్రులలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయనున్నట్లు కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్, ఆడియో మెట్రికన్, ఫిజియోథెరపిస్ట్ తదితర 13 పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హులైనవారు పెందుర్తి ప్రభుత్వ హాస్పిటల్లో మార్చ్ 17లోపు దరఖాస్తు అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు www.visakhapatnam.ap.gov.in చూడాలన్నారు.
News March 10, 2025
భీమిలి: గుండెపోటుతో టీచర్ మృతి

భీమిలి జూనియర్ కాలేజీలో ఇంటర్ ఇన్విజిలేటర్ గా ఉన్న డి.మాధవరావు(55) పరీక్షా కేంద్రంలోనే గుండెపోటుతో మృతి చెందాడు. రేకవానిపాలెం ఎంపీపీ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్న ఆయనకు ఇంటర్ ఇన్విజిలేషన్ విధులు అప్పగించారు. ఈమేరకు సోమవారం ఉ.8గంటలకు పరీక్షా కేంద్రంలో ఆయన కుప్పకూలిపోయాడు. సహచరులు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.