News January 27, 2025
వారిని విడిచి పెట్టేది లేదు: మంత్రి లోకేశ్

చట్టాలను ఉల్లంఘించే వారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచి పెట్టేది లేదని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. సోమవారం ఓ కోర్టు కేసుకు సంబంధించి హాజరైన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రెడ్ బుక్కును చూసి ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయని అన్నారు. అయితే టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు చట్టాలను ఉల్లంఘించే ఎవరినీ వదిలిపెట్టబోమని అన్నారు. ఈ సమావేశంలో ఎంపీ శ్రీభరత్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 13, 2025
అవయవ దానానికి ముందుకు రావాలి: కలెక్టర్

బ్రెయిన్ డెడ్ అయిన వారి అవయవాలను దానం చేసి ఆదర్శవంతంగా నిలవాలని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పిలుపు నిచ్చారు. గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఆర్కే బీచ్లో వాక్ థాన్ అన్ ఆర్గాన్ డొనేషన్ అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవదానంతో 8 మంది రోగులకు అవసరమైన అవయవాలు అమర్చవచ్చన్నారు. గత సంవత్సరం అవయవ దానం ద్వారా 210 మందికి అమర్చారని గుర్తు చేశారు.
News March 13, 2025
విశాఖ: హాల్ టికెట్ల పేరుతో విద్యార్థులను వేధిస్తే కఠిన చర్యలు

ఫీజులు పెండింగ్లో ఉన్నాయన్న నెపంతో పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లకు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని విశాఖకు చెందిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం అన్నారు. స్కూల్ యాజమాన్యాలు ఫీజులపై ఈ సమయంలో ఒత్తిడిని పెంచడం సమంజసం కాదన్నారు. ఆన్లైన్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని విద్యార్థులు పరీక్షలు రాయవచ్చన్నారు.
News March 13, 2025
పద్మనాభం: భూములు పరిశీలించిన జేసీ మాయూర్ అశోక్

పద్మనాభం మండలంలోని కృష్ణాపురం, రెడ్డిపల్లి గ్రామాల్లో పారిశ్రామిక (ఎంఎస్ఎంఈ) పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వ భూములను గురువారం జాయింట్ కలెక్టరు మయూర్ అశోక్ పరిశీలించారు. తహసీల్దారు కె.ఆనందరావుతో కలిసి ఆయా గ్రామాల్లోని భూములను పరిశీలించారు. వాటి రికార్డులు, భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని అవకాశాలు కుదిరితే ఈ భూములను ఏపీఐఐసీకి బదలాయించి పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలన్నారు.