News August 26, 2024

వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఏలూరు ఎంపీ

image

జిల్లాలో చేపల చెరువుల్లో కోళ్ళ వ్యర్థాలు వాడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, ఎస్పీలకు తగు ఆదేశాలు ఇస్తామన్నారు. ఏలూరులోని మత్స్యశాఖ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఎంపీ మాట్లాడారు. సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్ నాగలింగాచారి, బాదంపూడి అసిస్టెంట్ డైరెక్టర్ నరసయ్య పాల్గొన్నారు.

Similar News

News September 8, 2024

ఏలూరు: 108 పాదరసాల శివలింగం.. మీరు వెళ్లారా..?

image

కొయ్యలగూడెం మండలం కన్నాపురంలో ‘108 పాదరసాల శివలింగం’ భక్తుల పూజలందుకుంటోంది. శివకుమార్ అనే మహర్షి రాష్ట్రాలు తిరుగుతూ ఇక్కడికి వచ్చిన సందర్భంలో లింగాన్ని ప్రతిష్ఠించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ లింగాన్ని పూజిస్తే కోటి లింగాలకు పూజ చేసిన ఫలితం కలుగుతందని భక్తుల నమ్మకం. ఏటా శివరాత్రికి ముందు రోజు అన్నపూర్ణకు, శివునికి వివాహం జరుపుతారని, పాదరసాలతోనే అభిషేకాలు చేస్తారు. మీరు ఎపుడైనా వెళ్లారా..?

News September 8, 2024

ఏలూరు: ఈ నెల 10న జాబ్ మేళా

image

ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో భీమడోలు శ్రీ వెంకటేశ్వర కళాశాల (స్కిల్ హబ్)లో ఈ నెల 10వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి సుధాకర్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో 180 మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. అభ్యర్థులు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీలలో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. 18 నుంచి 30ఏళ్ల వయసు వారు అర్హులని తెలిపారు.

News September 8, 2024

ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ పర్యటన రద్దు

image

ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ రేపటి పర్యటన రద్దు అయినట్లు ఎంపీ కార్యాలయం నుంచి శనివారం ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో పర్యటన రద్దయిందని, తిరిగి కొత్త షెడ్యూల్‌ను మళ్లీ వెల్లడిస్తామని తెలియజేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు సైతం వారి ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని కోరారు.