News December 20, 2024

వారిపై చర్యలు తీసుకోండి: అనంత ఎస్పీ ఆదేశం

image

మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ పోలీసులకు సూచించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలకు మద్యం తాగి డ్రైవింగే చేయడమే ప్రధాన కారణంగా ఉందని తెలిపారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు వాహనాలు నడపకుండా ఆ కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే జరిమానాలను 3నెలల్లోపు చెల్లించకపోతే వాహనాన్ని జప్తు చేస్తామని స్పష్టం చేశారు.

Similar News

News January 16, 2025

పెనుకొండ దారుణ ఘటన.. 22 మందిపై కేసు

image

ప్రేమికులు పారిపోవడానికి సహకరించిందన్న నెపంతో మహిళను వివస్త్రను <<15165737>>చేసి<<>> జుట్టు కత్తిరించిన ఘటన చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలో జరిగిన ఈ దారుణ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు 22 మందిపై కేసు నమోదు చేసినట్లు కియా పోలీసులు తెలిపారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు బాధితురాలి నుంచి వివరాలు తెలుసుకున్నారు.

News January 16, 2025

అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా: ఎస్పీ

image

శ్రీ సత్యసాయి జిల్లాలో జరుగు అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగుతోందని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఎస్పీ మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, జూదం ఆడుతున్న వారిపై డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ కొనసాగిస్తామన్నారు. డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు.

News January 15, 2025

కాకి అనే ఊరు ఉందని మీకు తెలుసా?

image

కొన్ని ఊర్ల పేర్లు వింటే ఇవి నిజంగానే ఉన్నాయా? అనే సందేహం వస్తుంది. శ్రీసత్యసాయి జిల్లా రొల్ల మండలంలోని ‘కాకి’ అనే గ్రామం కూడా ఇదే కోవలోకి వస్తుంది. దీని పూర్తిపేరు కాంచన కిరీటి. ఏపీలో చివరి గ్రామంగా, కర్ణాటకకు సరిహద్దుగా ఉంటుంది. 2011 జనాభా ప్రకారం ఈ గ్రామంలో 838 ఇళ్లు ఉన్నాయి. దాదాపు 3వేలకు పైగా జనాభా ఉన్నారు. ఇలా మీకు తెలిసిన గ్రామం పేర్లు ఉంటే కామెంట్ చేయండి.