News February 16, 2025

వారి లైసెన్సులను రద్దు చేస్తాం: VZM కలెక్టర్

image

ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలు పాటించాలని, ఇక పై నిబంధనలు పాటించని వారి లైసెన్స్‌ను రద్దు చేస్తామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. వేగం కన్నా సురక్షితంగా చేరడం ముఖ్యమని, ప్రతి వాహన దారుడు తాను సురక్షితంగా ఉంటూ పక్క వారిని కూడా సురక్షితంగా ఉంచాలని అన్నారు.

Similar News

News November 4, 2025

యువకుడికి మూడేళ్ల జైలు శిక్ష: విజయనగరం ఎస్పీ

image

జామి మండలం మాదవరాయమెట్ట గ్రామానికి చెందిన వంతల శివ (23)పై పోక్సో కేసులో నేరం రుజువై 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.4వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందని ఎస్పీ దామోదర్ తెలిపారు. బాధిత బాలికకు రూ.50వేల పరిహారం మంజూరు చేసిందన్నారు. కేసు దర్యాప్తు చేసి, నిందితుడిని శిక్షించడంలో జామి పోలీసుల కృషిని ఎస్పీ అభినందించారు. 2024లో బాలికపై అత్యాచారానికి పాల్పాడగా శిక్ష ఖరారైందని తెలిపారు.

News November 4, 2025

ప్రజా సమస్యలను శ్రద్ధగా విని పరిష్కరించండి: SP

image

ప్రజల సమస్యలను శ్రద్ధగా విని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్పీ ఎ.ఆర్. దామోదర్, ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 54 ఫిర్యాదులు స్వీకరించి, వాటిలో భూగాదాలు, కుటుంబ కలహాలు, మోసాలకు సంబంధించినవని తెలిపారు. ఫిర్యాదులపై తక్షణ స్పందనతో 7 రోజుల్లో పరిష్కారం కల్పించాలని సూచించారు.

News November 4, 2025

ఎస్.కోట విలీనానికి ‘ఎస్’ అంటారా?

image

జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఎస్.కోట నియోజకవర్గం కూటమి ప్రజాప్రతినిధుల హామీ తెరపైకి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో విశాఖ ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే విజయనగరం జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. పలువురు రాజకీయ నేతలు, ప్రజా సంఘాల వారు మంత్రివర్గ ఉపసంఘానికి వినతులు సమర్పించారు. స్థానిక కూటమి నేతల ప్రపోజల్‌కు అధిష్ఠానం ‘ఎస్’ అంటుందో ‘నో’ అంటుందో చూడాలి.