News February 16, 2025
వారి లైసెన్సులను రద్దు చేస్తాం: VZM కలెక్టర్

ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలు పాటించాలని, ఇక పై నిబంధనలు పాటించని వారి లైసెన్స్‌ను రద్దు చేస్తామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. వేగం కన్నా సురక్షితంగా చేరడం ముఖ్యమని, ప్రతి వాహన దారుడు తాను సురక్షితంగా ఉంటూ పక్క వారిని కూడా సురక్షితంగా ఉంచాలని అన్నారు.
Similar News
News March 24, 2025
చీపురుపల్లి: అబ్బాయ్‌ను బాబాయ్ పక్కన పెడుతున్నారా..?

చీపురుపల్లి TDPలో కలహాలు తారస్థాయికి చేరుకున్నాయనే గుసగుసలు సొంత పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ప్రస్తుత MLA కళా వెంకట్రావుకు, TDP జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున మధ్య పొసగడం లేదని టాక్. ఇటీవల TDP ఆఫీస్ ప్రారంభానికీ నాగార్జున రాకపోవడం ఈ వార్తలకు బలం చేకూర్చుతోంది. రానున్న ఎన్నికల్లో తన కుమారుడు రామ్ మల్లిక్‌కు లైన్ క్లియర్ చేసేందుకు కళా యత్నిస్తున్నట్లు చర్చ నడుస్తోంది.
News March 24, 2025
VZM: ఈ నెల 25,26 తేదీల్లో APPSC పరీక్షలు

ఈ నెల 25,26 తేదీల్లో జరగనున్న APPSC పరీక్షలకు పకడ్బంధీగా ఏర్పాట్లు చేయాలని DRO ఎస్.శ్రీనివాసమూర్తి ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై సోమవారం తన చాంబర్లో సమావేశం నిర్వహించారు. 25న అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్, 25, 26 తేదీల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులోని అనలిస్ట్ గ్రేడ్-2 ఉద్యోగాలకు, 26న డిప్యుటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు జరుగుతాయన్నారు.
News March 24, 2025
VZM: టెన్త్ పరీక్షలకు 22,786 మంది హాజరు

సోమవారం జిల్లా వ్యాప్తంగా 119 పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన టెన్త్ గణితం పరీక్షలకు 22,786 మంది విద్యార్థులు హాజరుకాగ 104 మంది గైర్హాజరు అయ్యారని విజయనగరం జిల్లా విద్యా శాఖాధికారి మాణిక్యం నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం విద్యార్థులు 22890 మంది హాజరు కావాల్సి ఉండగా 22,786 మంది మాత్రమే హాజరైయ్యారని అన్నారు. విద్యార్థులు హజరు 99.55% శాతంగా నమోదు అయిందని, పరీక్ష సజావుగా జరిగిందని తెలియజేసారు.