News March 25, 2025
వారి వలలో పడకండి: అన్నమయ్య ఎస్పీ

నకిలీ రుణ మోసాలు ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయాయి. ఇవి ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయని అన్నమయ్య ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామని ప్రకటనలు చేస్తారు. రుణం కావాలంటే మీ ఆధార్, పాన్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని సమర్పించాలని అడుగుతారు. రుణం మంజూరుకు ముందు కొంత డబ్బు చెల్లించాలని అడుగుతారు. వ్యక్తిగత సమాచారం తెలుసుకుని మోసం చేస్తారని చెప్పారు.
Similar News
News February 23, 2026
ప్రొద్దుటూరులో నేడు బంగారం, వెండి ధరలు ఇలా

*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,750
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.14,490
*వెండి 10 గ్రాముల ధర రూ.2,700
News February 23, 2026
నిర్మల్: అంగన్వాడీలకు విద్యుత్ సౌకర్యం

జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుత్ మీటర్ల బిగింపు ప్రక్రియ వేగంగా సాగుతోంది. జిల్లావ్యాప్తంగా 381 కేంద్రాలకు గాను ఇప్పటికే 290 కేంద్రాల్లో మీటర్లు అమర్చారు. మిగిలిన 91 కేంద్రాల్లో త్వరలోనే పనులు పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి రావడంతో చిన్నారులకు, గర్భిణులకు మెరుగైన వసతులు లభించనున్నాయి. చీకటి కష్టాలు తొలగి అంగన్వాడీలు వెలుగులతో కళకళలాడనున్నాయి.
News February 23, 2026
రోజూ గుమ్మడి గింజలు తింటే సంతాన సమస్యలకు చెక్!

గుమ్మడి గింజల్లో ప్రొటీన్స్, ఫైబర్, మెగ్నీషియం, జింక్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. రోజూ 30 గ్రాములు తింటే టైప్-2 డయాబెటిస్, హైబీపీ, సంతాన సమస్యలు, మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు, PCOS, థైరాయిడ్, ఊబకాయం వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు దృఢంగా అవుతాయి. కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. మంచి నిద్ర పడుతుందని వైద్యులు చెబుతున్నారు.


