News March 8, 2025
వారులేనిదే సృష్టి లేదు: ఎమ్మెల్యే బండారు

సర్వం మహిళా మూర్తులేనని, వారులేనిదే సృష్టి లేదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తపేట పంచాయితీ కార్యాలయంలో ఎమ్మెల్యే సత్యానందరావు మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యత్ర నార్యస్తు పూజ్యంతే రమన్తే తత్ర దేవతా.. అంటే స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని ఆయన పేర్కొన్నారు.
Similar News
News October 31, 2025
NABFINSలో ఉద్యోగాలు

నాబార్డ్ ఫైనాన్షియల్ సర్వీస్ (NABFINS) వివిధ రీజియన్లలో కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ అర్హతగల అభ్యర్థులు నవంబర్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు. పని అనుభవం ఉన్నవారు, ఫ్రెషర్స్ కూడా దరఖాస్తుకు అర్హులే. టూవీలర్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 33ఏళ్లు. వెబ్సైట్: https://nabfins.org/
News October 31, 2025
జూబ్లీహిల్స్: నేటి నుంచి బీఆర్ఎస్ ‘మాట.. ముచ్చట’

జూబ్లీహిల్స్ ఎన్నికకు కేవలం 10 రోజులు మాత్రమే ఉండటంతో ప్రధాన రాజకీయపార్టీలు ప్రచారంలో దూసుకెళుతున్నాయి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేటి నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా ‘మాట.. ముచ్చట’ కార్యక్రమం జరుగనుంది. నియోజకవర్గంలో రద్దీ ప్రాంతాల్లో పార్టీ నాయకులు స్థానికులతో మాట్లాడనున్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చిస్తారు. నగర అభివృద్ధిపై మాట్లాడనున్నారు.
News October 31, 2025
రైల్వే స్టేషన్లలో ప్యాసింజర్ హోల్డింగ్ ఏరియాలు

TGలోని SECBAD, కాచిగూడ, APలోని విజయవాడ, TPT, రాజమండ్రి, GNTతో పాటు దేశంలో 76 స్టేషన్లలో ప్యాసింజర్ హోల్డింగ్ ఏరియాలు ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. మహా కుంభమేళా వేళ ఢిల్లీ స్టేషన్లో తొక్కిసలాట అనంతరం రద్దీని నియంత్రించేందుకు అక్కడ ‘యాత్రి సువిధ కేంద్ర’ను అభివృద్ధి చేశారు. ఇందులో టికెట్ కౌంటర్‌తో పాటు ప్రయాణికులు వేచి ఉండేలా వసతులు కల్పించారు. ఇదే మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేస్తారు.


