News March 8, 2025
వారులేనిదే సృష్టి లేదు: ఎమ్మెల్యే బండారు

సర్వం మహిళా మూర్తులేనని, వారులేనిదే సృష్టి లేదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తపేట పంచాయితీ కార్యాలయంలో ఎమ్మెల్యే సత్యానందరావు మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యత్ర నార్యస్తు పూజ్యంతే రమన్తే తత్ర దేవతా.. అంటే స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని ఆయన పేర్కొన్నారు.
Similar News
News February 12, 2026
MBNR: మహాశివరాత్రికి ఆర్టీసీ స్పెషల్ బస్సులు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం MBNR ఆర్టీసీ రీజియన్ భారీ ఏర్పాట్లు చేసింది. ఈనెల 13 నుంచి 16 వరకు ఉమ్మడి జిల్లా నుంచి శ్రీశైలానికి 304 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు RM సంతోష్ కుమార్ తెలిపారు. MBNR డిపోల నుంచి 72, NGKL 53, వనపర్తి 47, గద్వాల 34, అచ్చంపేట 28, NRPT 23, కొల్లాపూర్ 22, కల్వకుర్తి 16, షాద్‌నగర్ నుంచి 9, శివరాత్రి రోజు 153 స్పెషల్ బస్సులు నడుపుతున్నారు.
News February 12, 2026
వనపర్తి జిల్లాలోని కౌంటింగ్ కేంద్రాలు ఇవే..!

వనపర్తి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో శుక్రవారం మున్సిపల్ ఓట్లు కౌంటింగ్ ప్రారంభం కానుంది.
కౌంటింగ్ కేంద్రాలు..
వనపర్తి మున్సిపాలిటీ: ప్రభుత్వ డిగ్రీ కళాశాల నర్సింగాయి పల్లి.
పెబ్బేరు: ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాల జాతీయ రహదారి పక్కన.
కొత్తకోట: ప్రభుత్వ జూనియర్ కళాశాల
ఆత్మకూరు: ప్రభుత్వ జూనియర్ కళాశాల
అమరచింత: జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఓట్ల లెక్కింపు జరుగుతుందని అధికారులు తెలిపారు.
News February 12, 2026
గత MLAలు MRO సంతకాన్ని ఫోర్జరీ చేశారు: పార్వతీపురం MLA

పార్వతీపురంలో గత MLAలు MRO సంతకాలను ఫోర్జరీ చేసినట్లు MLA బోనెల విజయ్ చంద్ర ఆరోపించారు. ఇప్పటికీ పాత సంతకాలతో నకిలీ పట్టా పొజిషన్ ఇస్తున్నారన్నారు. అసెంబ్లీలో జిల్లాలోని రెవెన్యూ సమస్యలపై ఆయన ప్రస్తావించారు. MRO ఆఫీసులో ఉండాల్సిన రికార్డులు గత ప్రభుత్వంలో పాలనలో ఉన్న నాయకుల ఇళ్ల వద్ద ఉన్నట్లు అభియోగాలున్నాయన్నారు. అదేవిధంగా నగరంలో చాలా చెరువులను ఆక్రమించి జిరాయితీలుగా మార్చారని చెప్పారు.


