News October 21, 2024

వారోత్సవాలను విజయవంతం చేయండి: నెల్లూరు ఎస్పీ

image

నెల్లూరు జిల్లాలో పోలీసు అమరవీరుల వారోత్సవాలను విజయవంతం చేయాలని ఎస్పీ జి.కృష్ణకాంత్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నేటి నుంచి 31వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉండాలన్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన అమర పోలీసులను గుర్తు చేసుకోవడంతో పాటు సమాజంలో కీలకమైన పోలీసుల పాత్ర, విధులు, త్యాగాలు గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.

Similar News

News November 4, 2024

నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోండి: కమిషనర్

image

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం పొందాలని కమిషనర్ సూర్య తేజ ఆకాంక్షించారు. నేడు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రజలు నేరుగా తమ సమస్యలను అర్జీల రూపంలో తమకు చెప్పొచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News November 3, 2024

అధికారుల తీరుపట్ల మంత్రి ఆనం అసహనం 

image

ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పట్ల అధికారి వ్యవహరించిన తీరుపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ZP సమావేశంలో MPను సగౌరవంగా ఆహ్వానించకపోవడంతో అలిగి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అనంతరం వేమిరెడ్డికి అందరి తరఫున క్షమాపణలు చెబుతున్నట్లు మంత్రి తెలిపారు. 

News November 3, 2024

బాలాయపల్లి: జయంపు గ్రామంలో ఉద్రిక్తత

image

బాలాయపల్లి మండలం, జయంపు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శివారెడ్డి జనార్దన్ రెడ్డి ఇంటిపై అర్ధరాత్రి అదే గ్రామానికి చెందిన కొంతమంది దాడికి పాల్పడ్డారు. శివారెడ్డి జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులను అమానుషంగా కొట్టి గాయపరిచారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.