News January 16, 2026
వార్డుల రిజర్వేషన్లు పారదర్శకంగా ఉండాలి: కలెక్టర్

మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియను జీవో ప్రకారం అత్యంత పారదర్శకంగా, ఎలాంటి తప్పులు లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ కమిషనర్లు రిజర్వేషన్ పట్టికలను సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు. గణాంకాలు, రొటేషన్ పద్ధతి, గత డేటాను పరిశీలించాలని, ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే సంప్రదించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
Similar News
News February 14, 2026
విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న ఛాయా సోమేశ్వరాలయం

చారిత్రక ప్రసిద్ధి గాంచిన నల్లగొండ పట్టణంలోని ఛాయా సోమేశ్వరస్వామి ఆలయం మహాశివరాత్రి పర్వదినానికి సర్వంగ సుందరంగా సిద్ధమైంది. రేపు జరగనున్న వేడుకల కోసం ఆలయ కమిటీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.విద్యుత్ దీపాలంకరణతో ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా వెలుగుతోంది. తెల్లవారుజాము నుంచే అభిషేకాలు, ప్రత్యేక పూజలు ప్రారంభం కానున్నాయి.
News February 14, 2026
నల్గొండ: గుండెపోటుతో పంచాయతీ కార్యదర్శి మృతి

చిట్యాల మండలం నేరడ పంచాయతీ కార్యదర్శి మేకల వెంకటేశ్వరరావు (61) ఇవాళ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందాడు. హైదరాబాద్ ఇమ్లిబన్ బస్టాండ్‌లో ఈ ఘటన జరగ్గా పోలీసులు అధికారులకు సమాచారం ఇచ్చారు. గతంలో ఇదే మండలంలోని ఏపూరులో విధులు నిర్వహించారు. ఈ సెప్టెంబర్‌లో రిటైర్డ్ కావలసి ఉంది. ఆయన మృతి పట్ల మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, పీఎస్‌లు సానుభూతిని తెలిపారు.
News February 14, 2026
NLG: సేవలో ఆ ఇద్దరు ఉపాధ్యాయులు ఆదర్శం!

ఈ గురువులు.. చదువు చెప్పడానికే పరిమితం కాలేదు. విద్యార్థుల భవిష్యత్తుకు సమయాన్ని వెచ్చిస్తున్నారు. కట్టంగూర్ (M) మల్లారం ప్రాథమిక పాఠశాల HM సమ్మెటి తిరుమలేష్, ఉపాధ్యాయుడు షరీఫ్ తమ సేవాభావంతో స్థానికుల మెప్పు పొందుతున్నారు. కట్టంగూర్ శివారులోని పేలాల పరిశ్రమలో పని చేస్తున్న వలస కార్మికుల పిల్లలను ప్రతి రోజు ఉదయం ద్విచక్రవాహనంపై పాఠశాలకు తీసుకెళ్ళి సాయంత్రం మళ్లీ తల్లిదండ్రుల వద్దకు చేరుస్తున్నారు.


