News March 1, 2025
వార్షిక బడ్జెట్లో విజయవాడ మెట్రోకు రూ.50కోట్లు

వార్షిక బడ్జెట్లో విజయవాడ మెట్రో నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.50కోట్లు కేటాయించింది. కాగా మెట్రో పూర్తిచేసేందుకు కేంద్రం 100% భరించేలా గతంలో రాష్ట్రం ప్రతిపాదన పంపింది. ఈ ప్రతిపాదనపై కేంద్రం అధికారిక ప్రకటన ఇచ్చినట్లయితే రాష్ట్రం నుంచి మరిన్ని నిధుల కేటాయింపుకు అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్రం విజయవాడ మెట్రోపై సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
Similar News
News March 1, 2025
వారికి ఎక్స్గ్రేషియా.. సీఎం కీలక ఆదేశాలు

TG: గల్ఫ్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. రూ.5 లక్షల చొప్పున 113 బాధిత కుటుంబాలకు వెంటనే నిధులు విడుదల చేయాలన్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఖనిజాభివృద్ధి శాఖ సమీక్ష సందర్భంగా అధికారులు ఎక్స్గ్రేషియా విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తక్షణమే స్పందించిన సీఎం నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు.
News March 1, 2025
నంద్యాల నగరంలో భారీ ర్యాలీ

ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వారం రోజులపాటు మహిళా సాధికారతపై అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. శనివారం నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
News March 1, 2025
HYD: ఎల్బీనగర్లో ట్రాన్స్జెండర్ల పొదుపు సంఘం..!

HYDలో ట్రాన్స్జెండర్లు తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తూ ముందుకు వెళ్తున్నారు. తమ ప్రతిభను చాటి చెబుతూనే పలు రంగాల్లో రాణిస్తున్నారు. ఇటీవలే ట్రాఫిక్ ఉద్యోగాలకు సైతం వారిని ప్రభుత్వం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా.. GHMC & MEPMA సహకారంతో, అర్ధనారి ట్రాన్స్జెండర్ల పొదుపు సంఘం HYD ఎల్బీనగర్లో ఏర్పాటు జరగగా వారందరూ సంతోషం వ్యక్తం చేశారు.