News June 10, 2024

వాలంటీర్ల కష్టాలు.. కొత్త ప్రభుత్వంపై ఆశలు!

image

ఎన్నికల ప్రక్రియకు వాలంటీర్లను దూరంగా ఉంచాలనే EC ఆదేశాలతో వివాదం చెలరేగి చాలామంది రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వారి పరిస్థితి ఎటూ తేలని చందంగా ఉంది. కోనసీమలో నగరపాలక సంస్థ, 6 మున్సిపాలిటీలు, 21 మండలాల పరిధిలో 11,273 మంది వాలంటీర్లకు 10వేల మంది రాజీనామా చేశారు. 3నెలలుగా పనులు లేక, జీతాలు అందక వారందరి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కొత్త ప్రభుత్వంలో మంచిరోజులు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు.

Similar News

News September 30, 2024

కాకినాడ: ‘అమ్మ నన్ను ట్రైన్ ఎక్కించి వాటర్ కోసం వెళ్లి రాలేదు’

image

బెంగళూరు రైల్వే స్టేషన్‌లో ఓ తల్లి వాటర్ బాటిల్ కోసం దిగగా.. ఆమె 14ఏళ్ల కుమార్తె కాకినాడకు చేరింది. RPF పోలీసులు కాకినాడలో ఆ బాలికను గమనించి వివరాలు సేకరించారు. ‘బెంగళూరు వైట్‌ఫీల్డ్ స్టేషన్‌లో అమ్మ నన్ను రైలు ఎక్కించి వాటర్ బాటిల్ కోసం వెళ్లి తిరిగి రాలేదు. ఈ లోగా రైలు కదలడంతో కాకినాడ చేరా’నని పేర్కొంది. బాలిక వివరాలు చెప్పలేకపోతుందని, సఖీ, చైల్డ్‌ హెల్ప్‌లైన్ అధికారులకు అప్పగించామని తెలిపారు.

News September 30, 2024

తూ.గో: ఫొటోషూట్‌.. వాగులో గల్లంతైన విద్యార్థి

image

ఫ్రెండ్స్‌తో సరదాగా ఫొటోషూట్‌కు వెళ్లిన ఓ విద్యార్థి వాగులో గల్లంతయ్యాడు. ఈ ఘటన తూ.గో జిల్లా సీతానగరంలో జరిగింది. కుటుంబీకులు, పోలీసుల వివరాల ప్రకారం.. సీతానగరానికి చెందిన వి.వినయ్(15) రఘుదేవపురంలోని ఓ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో ఫ్రెండ్స్‌తో కలిసి బైక్‌‌లపై ఫొటోషూట్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో వినయ్ వాగులో గల్లంతు కాగా.. రాత్రి 9 గంటల వరకు గాలించినా అతడి ఆచూకీ లభించలేదు.

News September 29, 2024

కాకినాడ వాసి ఫిర్యాదు.. యాపిల్ సంస్థకు రూ.లక్ష ఫైన్

image

ప్రముఖ మొబైల్ సంస్థ ‘యాపిల్’కు కాకినాడ వినియోగదారుల కమిషన్ రూ.లక్ష ఫైన్ విధించింది. కాకినాడలోని సూర్యారావుపేటకు చెందిన పద్మరాజు 2021 OCT 13న రూ.85,800లకు యాపిల్ ఫోన్ కొన్నారు. ఫోన్ కొంటే ఇయర్ పాడ్స్ ఫ్రీ అని ప్రకటించిన సంస్థ.. తనకు ఫోన్ పంపి, ఇయర్ పాడ్స్ ఇవ్వలేదని పద్మరాజు పలుమార్లు కస్టమర్ కేర్‌కు ఫోన్ చేశారు. స్పందన లేకపోవడంతో ఆయన 2022లో కమిషన్‌ను ఆశ్రయించగా.. శనివారం తీర్పు వెలువడింది.