News November 11, 2024
వాల్తేర్ డీఆర్ఎంతో విజయనగరం ఎంపీ భేటీ.. చర్చించిన అంశాలివే..!

☛ కోమటిపల్లి రైల్వే వ్యాగన్ లోడింగ్ పాయింట్‌ను సీతానగరం స్టేషన్‌కు మార్చాలి
☛ బొబ్బిలిలో వందే భారత్‌కు హాల్టింగ్
☛ విజయనగరంలోని రైల్వే అండర్ పాస్ నిర్మాణంపై ఆరా
☛ పార్వతీపురం-గుమడ మధ్య ఫ్లైఓవర్ల నిర్మాణం
☛ కొత్తగా ప్రతిపాదించిన పాలకొండ-రాజాం రైల్వే లైన్ నిర్మాణ ప్రగతిపై ఆరా
☛ చీపురుపల్లి రోడ్డు ఓవర్ బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలని ఎంపీ కోరగా సంక్రాంతి లోపు నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు.
Similar News
News January 25, 2026
ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగులకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్

విజయనగరం జిల్లాలోని దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్‌లకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఆన్‌లైన్ శిక్షణ, పోటీ పరీక్షల కోచింగ్ అందిస్తోందని విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు వెంకటేశ్వరరావు శనివారం తెలిపారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం చేయడం, IT/ITES రంగాల్లో ఉపాధి అవకాశాల కోసం నైపుణ్యాభివృద్ధి కల్పిస్తారని పేర్కొన్నారు. అభ్యర్థులు apdascac.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News January 25, 2026
కన్నుల పండుగలా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగాలి: ఎస్పీ

గణతంత్ర దినోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించాలని SP దామోదర్ అధికారులను ఆదేశించారు. జనవరి 26న పరేడ్ గ్రౌండ్‌లో జరిగే ఏర్పాట్లను ఆయన శనివారం పర్యవేక్షించారు. వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని, ప్రజలు, విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందేలా కార్యక్రమాలు ఉండాలని సూచించారు. వాహనాల పార్కింగ్, తనిఖీలు, శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు.