News January 25, 2025

వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి: మంత్రి సీతక్క

image

వాహనదారులు బయటకు వెళ్లేటప్పుడు కుటుంబ సభ్యులు తమ కోసం ఎదురు చూస్తుంటారన్న విషయాన్ని గుర్తుంచు కోవాలని మంత్రి సీతక్క అన్నారు. ములుగులో జరిగిన రోడ్డు భద్రత మాస ఉత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగావచ్చిన మంత్రి మాట్లాడుతూ.. వాహనం నడిపేటప్పుడు ప్రతిఒక్కరు జాగ్రత్తలు పాటించాలన్నారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్, కార్లు నడిపేవారు సీటు బెల్టు ధరించాలని, మద్యం తాగి, సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపవద్దన్నారు.

Similar News

News February 16, 2025

ఘజన్‌ఫర్ స్థానంలో ముంబైలోకి ముజీబ్

image

IPL: అఫ్గానిస్థాన్ ప్లేయర్ అల్లా ఘజన్‌ఫర్ స్థానంలో ముజీబ్‌ ఉర్ రహ్మాన్‌ను ముంబై జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఐపీఎల్‌కు ఘజన్‌ఫర్ దూరమయ్యారు. గత ఏడాది జరిగిన వేలంలో రూ.4.8 కోట్లు వెచ్చించి ముంబై ఇతడిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈసారి MI స్పిన్నర్లు శాంట్నర్, ముజీబ్ ఎలా రాణిస్తారో చూడాలి.

News February 16, 2025

రూ.62కోట్ల నష్టం తెచ్చిపెట్టిన ఎక్స్‌ప్రెస్

image

సాధారణంగా రైళ్లలో చాలా రద్దీ ఉంటుంది. సీటు దొరకడమే కష్టం. అయితే ఢిల్లీ-లక్నో, అహ్మదాబాద్-ముంబై మార్గాల్లో నడిచే తేజస్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికుల కొరతతో ఇబ్బంది పడుతోంది. గత మూడేళ్లుగా ఈ ట్రైన్ వల్ల రైల్వేశాఖకు రూ.62.88 కోట్ల నష్టం వచ్చింది. దీంతో దీని నిర్వహణ బాధ్యతను రైల్వే IRCTCకి అప్పగించింది. అయినప్పటికీ తగినంతగా ప్యాసింజర్‌లు లేక నష్టాల మార్గంలో ప్రయాణిస్తోంది.

News February 16, 2025

రామతీర్థంలో 26 నుంచి శివరాత్రి జాతర

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఈ నెల 26వ తేదీ నుంచి మూడురోజుల పాటు శివరాత్రి జాతర మహోత్సవం జరగనుంది. 26, 27 తేదీల్లో భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. శివరాత్రి నాడు లక్షలాది మంది భక్తులు జాగరణ చేస్తారు. 28న వేద పారాయణం అనంతరం స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం జరిపిస్తారు. జాతరకు ఉత్తరాంధ్ర నుంచి సుమారు 5 లక్షల మంది భక్తులు విచ్చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

error: Content is protected !!