News September 20, 2024

వాహనాలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి: అదనపు ఎస్పీ

image

MHBD జిల్లా పరిధిలోని సబ్ డివిజన్‌కు చెందిన పోలీస్ వాహనాల పనితీరు నిర్వహణను అడిషనల్ ఎస్పీ చెన్నయ్య జిల్లా పోలీస్ కార్యాలయంలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు వాహనాలను నిరంతరంగా ప్రజాసేవలకు వినియోగించాల్సి ఉన్నందున ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంచి కండిషన్లో ఉంచుకోవాలని వాహన డ్రైవర్లను ఆదేశించారు.

Similar News

News October 10, 2024

వరంగల్: బతుకమ్మ వేడుకల్లో అపశృతి

image

వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో విషాదం చోటుచేసుకుంది. అలంకానిపేట గ్రామంలో బతుకమ్మ వేడుకల్లో యాకయ్య అనే వ్యక్తి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. గమనించిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా యాకయ్య మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. యాకయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News October 10, 2024

HNK: రతన్ టాటా మరణం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రులు..

image

నవభారత నిర్మాత, భారత పారిశ్రామిక రంగానికి మార్గదర్శి, టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా మరణం బాధాకరమని మంత్రులు కొండా సురేఖ, సీతక్క అన్నారు. ఎంతో మందికి ఆదర్శప్రాయుడిగా నిలిచి, భారత సమాజం గర్వించే ప్రపంచ వ్యాపారవేత్తగా రతన్ టాటా నిలిచారని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు మంత్రులు తెలిపారు.

News October 10, 2024

హనుమకొండ జిల్లాలో విషాదం.. ఒకేరోజు తల్లి, కొడుకు మృతి

image

హనుమకొండ జిల్లాలో బుధవారం విషాదం నెలకొంది. వివరాలిలా.. భీమదేవరపల్లి మండలం ములుకనూరుకి చెందిన శోభ(53)కు టీబీ వ్యాధి సోకగా, కుమారుడు సాయికిరణ్(25) క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో తల్లి శోభ నిన్న ఉదయం చనిపోగా, సాయికిరణ్ రెండు గంటల్లో చనిపోయాడు. తల్లి, కొడుకు ఒకే రోజు మృతి చెందడంతో ఈ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.