News April 16, 2024
వాహన తనిఖీలు.. రూ.6 లక్షలు సీజ్: ఆర్డీవో
పెద్దాపురం మెయిన్ రోడ్‌లో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ.6 లక్షల నగదు పట్టుబడినట్లు ఆర్డీవో సీతారామారావు తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి వెంకట రాజగుప్తా పెద్దాపురం మెయిన్ రోడ్డులో వాహన తనిఖీలు నిర్వహించామన్నారు. కాండ్రకోటకు చెందిన పల్లికల శ్రీరామచంద్రమూర్తి అనే వ్యక్తి వద్ద ఎటువంటి పత్రాలు లేకుండా రూ.6లక్షల నగదు పట్టుబడిందని అన్నారు.
Similar News
News November 24, 2024
కాకినాడ: టీచర్‌ను కొట్టుకుంటూ తీసుకెళ్లారు
కాకినాడలోని ఓ మున్సిపల్ హైస్కూల్‌లో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్‌ను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. గుడ్ టచ్.. బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించేందుకు పాఠశాలకు వచ్చిన మహిళా పోలీసులకు తమ ఒంటిపై చేతులు వేసి టీచర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు వాపోయారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు టీచర్‌కు దేహశుద్ధి చేశారు. పోలీసులు వారికి సర్దిచెప్పి ఉపాధ్యాయుడిని పీఎస్‌కు తరలించారు.
News November 23, 2024
రాజవొమ్మంగి: 35 గోల్డ్ మెడల్స్ గెలిచిన ఒకే పాఠశాల విద్యార్థులు
తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలంలోని ఏకలవ్య పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో 35 గోల్డ్ మెడల్స్, 4 సిల్వర్, 4 బ్రాంజ్ మెడల్స్ కైవసం చేసుకున్నారని ప్రిన్సిపల్ కృష్ణారావు శనివారం మీడియాకు తెలిపారు. అరకులో జరిగిన జూడో, వెయిట్ లిఫ్టింగ్, యోగా, వాలీబాల్ క్రీడల్లో విజేతలుగా నిలిచారని చెప్పారు. విజేతలతోపాటు వారికి శిక్షణ ఇచ్చిన సిబ్బందిని సైతం ప్రిన్సిపల్, టీచర్స్ అభినందించారు.
News November 23, 2024
లక్కీఛాన్స్ కొట్టిన పి.గన్నవరం వాయిస్ ఆర్టిస్టు
నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, నెట్ ఫ్లెక్స్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ప్రచారం కానున్న ఆజాదీకా అమృత కహానియా డాక్యుమెంటరీకి తెలుగు భాష నుంచి వాయిస్ ఆర్టిస్టుగా పి.గన్నవరానికి చెందిన అడ్డగళ్ల రాధాకృష్ణను శుక్రవారం ఎంపిక చేశారు. 8 భాషలకు 8 మందిని బెస్ట్ వాయిస్ ఆర్టిస్టులను ఎంపిక చేయగా తెలుగు భాష నుంచి ఆ అవకాశం రాధాకృష్ణకు దక్కింది. ఈయన గతంలో పలు టీవీల్లో న్యూస్ రీడర్‌గా పనిచేశారు.