News March 22, 2024
వాహన తనిఖీల్లో భారీగా పట్టుబడ్డ గంజాయి
భద్రాచలం పట్టణంలోని వంతెన వద్ద స్థానిక పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో శుక్రవారం భారీగా గంజాయి పట్టుబడింది. అనుమానస్పదంగా ఉన్న వాహనాన్ని తనిఖీ చేయగా 67 కేజీల ఎండు గంజాయి దిండ్లు పట్టుబడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయిని, వాహనాన్ని పోలీసులు సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. గంజాయి విలువ సుమారు రూ.16.75లక్షలు ఉంటుందని తెలిపారు.
Similar News
News September 10, 2024
KMM: రూ.5 వేల కోట్లతో యంగ్ ఇండియా స్కూళ్లు: డిప్యూటీ సీఎం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో అక్షరాస్యత పెంపునకు రూ.5 వేల కోట్లతో యంగ్ ఇండియా స్కూళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీటిని 4వ తరగతి నుంచి ఇంటర్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో తీసుకొస్తామని చెప్పారు. టాటా కంపెనీ సహకారంతో 65 ITIలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అలాగే రాష్ట్రంలో ఏటా రూ.20 వేల కోట్లు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామన్నారు.
News September 10, 2024
KMM: పోలీస్ జాగిలానికి ఏఎస్పీ ఘన నివాళి
అనారోగ్యంతో మరణించిన పోలీస్ జాగిలం షైనీకి ఘనంగా అంతిమ వీడ్కోలు పలికారు. జిల్లా పోలీస్ శాఖకు పోలీస్ జాగిలం షైనీ అందించిన సేవలు మరువలేనివని అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ పరితోష్ పంకజ్ అన్నారు. ఈ రోజు జిల్లా పోలీస్ డాగ్ స్క్వాడ్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ జాగిలం అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. గత నెల రోజులుగా బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఈ రోజు తుది శ్వాస విడిచింది.
News September 10, 2024
ఖమ్మం: జిల్లాలో 76 కి.మీ.మేర దెబ్బతిన్న రహదారులు
ఖమ్మం జిల్లాలో వరదల కారణంగా 76 కి.మీ.మేర రహదారులు దెబ్బతిన్నాయి. పలు చోట్ల కోతకు గురికాగా, మరికొన్ని చోట్ల పూర్తిగా తెగిపోయాయి. ఈ మొత్తం నష్టం విలువ రూ.180.37 కోట్లుగా ఉందని అధికారులు పేర్కొన్నారు. అలాగే జిల్లావ్యాప్తంగా నీటిపారుదల శాఖ పరిధిలో రూ.60 కోట్ల మేర నష్టం జరిగిందని నివేదికల్లో పొందుపర్చారు. 45 చెరువులకు పలు ప్రాంతాల్లో గండ్లు పడ్డాయి. మొత్తంగా 103 ప్రాంతాల్లో ఈ శాఖకు నష్టం వాటిల్లింది.