News October 6, 2024

వింజమూరులో భారీ వర్షం

image

గత కొద్ది రోజులుగా వింజమూరు మండలం వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం కురిసింది. రోడ్లు జలమయం అయ్యాయి. వర్షం రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు, వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.

Similar News

News October 6, 2024

కండలేరు జలాశయంలో మత్స్యకారుడు గల్లంతు

image

రాపూరు మండలం కండలేరు జలాశయం ఓబులాయపల్లి సమీపంలో చేపల వేటుకు వెళ్లిన చెంచయ్య అనే మత్స్యకారుడు గల్లంతయ్యాడు. అతనికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. చేపలవేట సాగించి జీవనం సాగిస్తుంటాడు. చెంచయ్య ఆచూకీ కోసం కండలేరులో స్థానికులు గాలింపు వేగవంతం చేశారు.

News October 6, 2024

నెల్లూరు: ఈ నెల 9th లాస్ట్ డేట్

image

మద్యం దుకాణాలకు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోవాలని నెల్లూరు 1 టౌన్ ఎక్సైజ్ సీఐ రమేశ్ బాబు కోరారు. టెండర్లలో ఎంతమందైనా పాల్గొన వచ్చునని, ఒక వ్యక్తి ఒక షాప్‌కి ఎన్ని దరఖాస్తులైనా వేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉందని, దరఖాస్తు వివరాలకు https://hpfsproject.com/ సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై లు ప్రభాకర్ రావు, శ్రీధర్, మురళి కృష్ణ ఉన్నారు.

News October 6, 2024

నెల్లూరు: దసరాకు ఊర్లకు వెళ్లేవారికి హెచ్చరిక

image

నెల్లూరు జిల్లాలో దసరా పండుగ రోజుల్లో ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వెళ్లేవారు దొంగతనాలు జరగకుండా లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంను వినియోగించుకోవాలని ఎస్పీ జి క్రిష్ణ కాంత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. LHMS యాప్, 9440796383, 9392903413 నంబర్ లకు, స్థానిక పోలీసులను సంప్రదించి LHMS సేవలు ఉచితంగా పొందవచ్చన్నారు. డబ్బు, విలువైన ఆభరణాలు ఇంట్లో ఉంచి వెళ్లకూడదని బ్యాంకులో ఉంచుకోవాలన్నారు.