News March 14, 2025

వింత ఆచారం.. మగాళ్లు చీర కట్టులో!

image

హోలీ అంటే గుర్తొచ్చేది రంగులు, కాముని దహనం. కానీ ఆదోని మండలం సంతేకుడ్లూరు గ్రామంలో ఈ పండుగ వచ్చిందంటే జంబలకడిపంబ సినిమా కనపడుతుంది. ఈ రోజున గ్రామంలోని పురుషులు చీరలు కట్టుకుని అమ్మాయిలుగా మారిపోతారు. భక్తిశ్రద్ధలతో రతి మన్మథుడికి పూజలు చేస్తారు. ఇలా చేస్తే కోరికలు నెరవేరుతాయన్నది వారి నమ్మకం. 100ఏళ్ల నుంచి వస్తున్న ఆచారాన్ని నేటికీ పాటిస్తున్నారు.
#HappyHoli

Similar News

News December 5, 2025

భామిని: లెర్నింగ్ టూల్స్‌ను పరిశీలించిన సీఎం

image

భామినిలోని జరిగిన మెగా PTM కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో సీఎం చంద్రబాబు
ముచ్చటించారు. అనంతరం విద్యార్థులకు ఇచ్చిన లెర్నింగ్ టూల్స్‌ను పరిశీలించి వారిని అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తుపై దృష్టి సారించి విషయ పరిజ్ఞానాన్ని మరింత ముందుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన తెలిపారు.

News December 5, 2025

GNT: జాతీయ రహదారిపై ప్రమాదం.. విద్యార్థిని స్పాట్ డెడ్

image

గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో SRM యూనివర్సిటీ విద్యార్థిని అక్కడికక్కడే మరణించింది. మృతురాలు SRMలో BBA చదువుతున్న మచిలీపట్నానికి చెందిన సుమయ్య (18)గా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News December 5, 2025

నన్ను ఎన్నుకున్నది అరిచేందుకు కాదు: శశిథరూర్

image

ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడుతుండటంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో గొంతు వినిపించేందుకు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదన్నారు. ‘పార్టీలో నాది ఏకైక గొంతు కావచ్చు. కానీ పార్లమెంటులో ప్రజల తరఫున ప్రాతినిధ్యం వహించడానికే నన్ను ఎన్నుకున్నారు. అరవడానికో, గొడవలు చేయడానికో కాదు. వారి కోసం, దేశం కోసం మాట్లాడేందుకు పంపించారు’ అని అన్నారు.