News March 14, 2025
వింత ఆచారం.. మగాళ్లు చీర కట్టులో!

హోలీ అంటే గుర్తొచ్చేది రంగులు, కాముని దహనం. కానీ ఆదోని మండలం సంతేకుడ్లూరు గ్రామంలో ఈ పండుగ వచ్చిందంటే జంబలకడిపంబ సినిమా కనపడుతుంది. ఈ రోజున గ్రామంలోని పురుషులు చీరలు కట్టుకుని అమ్మాయిలుగా మారిపోతారు. భక్తిశ్రద్ధలతో రతి మన్మథుడికి పూజలు చేస్తారు. ఇలా చేస్తే కోరికలు నెరవేరుతాయన్నది వారి నమ్మకం. 100ఏళ్ల నుంచి వస్తున్న ఆచారాన్ని నేటికీ పాటిస్తున్నారు.
#HappyHoli
Similar News
News March 26, 2025
జాగ్రత్త.. ఉదయాన్నే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. !

ఉదయాన్నే నిద్ర లేవగానే చాలా నీరసం, కళ్లు తిరిగినట్లు అనిపించడం, రాత్రంతా పలుమార్లు మూత్రవిసర్జనకోసం లేవాల్సి రావడం, నాలుక-పెదాలు మాట్లాడలేనంతగా తడారిపోవడం, టైమ్‌కి తినకపోతే శరీరం వణుకు రావడం.. ఇవన్నీ షుగర్ లక్షణాలేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలా అనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
News March 26, 2025
చిత్తూరు జిల్లాలో భయపెడుతున్న భానుడు

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఉ.11కే భానుడు దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతో ఠారెత్తిస్తున్నాడు. మంగళవారం తవణంపల్లెలో దాదాపు 40, గంగవరంలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చిత్తూరులో 38, నగరిలో 37, పలమనేరులో 37.5, కుప్పంలో 33.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మీ ప్రాంతంలో కూడా ఇలానే ఉంటే కామెంట్ చేయండి.
News March 26, 2025
సికింద్రాబాద్‌లో యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

సికింద్రాబాద్ మహంకాళి PS పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం.. వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్పాట్‌లోనే ఒకరు మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. స్పాట్ వద్ద సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.