News March 18, 2025

వింత వ్యాధి.. సూర్యాపేట జిల్లాలో భయం.. భయం..!

image

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ సహా వివిధ మండలాల్లో వీధి కుక్కలకు పది రోజులుగా వింత వ్యాధి సోకుతోందని స్థానికులు తెలిపారు. వాటి శరీరంపై పుండ్లు వ్యాపించి, నల్లరంగుతో కూడిన మచ్చలు ఏర్పడుతున్నాయన్నారు. ఓ కుక్క రెండు రోజుల క్రితం మూడేళ్ల బాలుడిని కరిచేందుకు వెంటాడింది. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు. చిన్నారులకు ప్రాణహాని ఉందని, అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.   

Similar News

News March 18, 2025

తిరుపతి జిల్లాలో మైక్రో ఇరిగేషన్ సాగు ఎంతంటే?

image

తిరుపతి జిల్లాలో మైక్రో ఇరిగేషన్ అమలు, పురోగతి, లబ్ధిదారుల వివరాలు, సూక్ష్మ నీటిపారుదల సాంకేతికత ప్రోత్సాహం గురించి ఎంపీ మద్దిల గురుమూర్తి పార్లమెంట్‌లో మంగళవారం ప్రశ్నించారు. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామనాథ్ ఠాకూర్ సమాధానం ఇచ్చారు. పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం 2015-16 నుంచి అమలులో ఉందని తెలిపారు. ఇప్పటి వరకు 96.97 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మైక్రో-ఇరిగేషన్ చేపట్టారని తెలిపారు.

News March 18, 2025

చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన జర్నలిస్టులు

image

చంచల్‌గూడ జైలులో ఉన్న యూట్యూబ్ జర్నలిస్టులు తన్వి యాదవ్, రేవతిలు విడుదలయ్యారు. సోమవారం నాంపల్లి కోర్టు యూట్యూబ్ జర్నలిస్టులకు రూ.25వేల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది. కాగా.. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై యూట్యూబ్ జర్నలిస్టులు తమ ఛానల్లో ప్రసారం చేసిన ఓ వీడియోపై రిమాండ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే.

News March 18, 2025

రేపు GATE ఫలితాల విడుదల

image

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE-2025) ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలలోపు రిజల్ట్స్ వెల్లడయ్యే అవకాశం ఉంది. gate2025.iitr.ac.in వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. మార్చి 28 నుంచి మే 31 వరకు స్కోర్ కార్డులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో ఈ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!