News March 5, 2025
వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ పోస్టర్ విడుదల

బుధవారం పాలమూరు వర్సిటీలోని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎన్. శ్రీనివాస్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ చెన్నప్ప చేతుల మీదుగా వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ -2025 పోస్టర్ అవిస్కరించారు. ఈనెల నెల 9లోగా 18 నుండి 25ఏళ్లులోపు విద్యార్థులు, యువత ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మై భారత్ పోర్టల్ పోర్టల్‌లో నమోదు చేసుకొని ఒక్క నిమిషం వీడియోను పంపాలన్నారు.
Similar News
News March 15, 2025
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో నేటి ధరలు

బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు శనివారం 66 మంది రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్మడానికి తీసుకువచ్చారు. వేరుశనగలు 392 క్వింటాలు రాగా గరిష్ఠ ధర రూ.6,871, కనిష్ఠ ధర రూ.5,869, లభించింది. మొక్కజొన్న 596 క్వింటాలు రాగా గరిష్ఠ ధర రూ.2,321, కనిష్ఠ ధర రూ.2,127గా ఉంది. ఆముదాలు15 క్వింటాలు రాగా గరిష్ఠ ధర రూ.6,125, కనిష్ఠ ధర రూ.6,060 లభించింది.
News March 15, 2025
MBNR: GOOD NEWS.. APPLY చేసుకోండి.!

బీసీ స్టడీ సర్కిల్లో బ్యాంకింగ్ & ఫైనాన్స్‌లో ఒక నెల నాన్ రెసిడెన్షియల్ ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు BC స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎ.స్వప్న తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్‌కు చెందిన అర్హులైన బీసీ అభ్యర్థులు ఈనెల 15 నుంచి ఏప్రిల్ 8లోగా సంబంధిత వెబ్ సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలని, ఏప్రిల్ 12న MBNRలో ఆన్‌లైన్ స్క్రీనింగ్ పరీక్ష ఉంటుందన్నారు. ప్రైవేట్ బ్యాంకుల్లో ప్లేస్‌మెంట్ కల్పిస్తామన్నారు.
News March 15, 2025
ధన్వాడ: చిరుత దాడిలో దూడ మృతి.!

చిరుత దాడిలో లేగదూడ మృతి చెందిన ఘటన NRPT జిల్లా ధన్వాడ మండలంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలానికి చెందిన రైతు చెట్టుకింది కథలప్ప పొలంలో శుక్రవారం రాత్రి లేగదూడపై చిరుత దాడి చేయడంతో మృతి చెందింది. సుమారు రూ.60 వేలు నష్టం వాటిలినట్లు రైతు తెలిపారు. శనివారం ఉదయం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మల్లేశ్ ఘటన ప్రదేశాన్ని పరిశీలించి చిరుత దాడి జరిగినట్లు నిర్ధారించారు.