News January 28, 2025

వికారాబాద్‌ను ఎకో టూరిజంగా అభివృద్ధి చేస్తున్నాం: సీఎం

image

వికారాబాద్ ప్రాంతానికి ఎంతో ప్రత్యేకత ఉందని వికారాబాద్‌ను ఎకో టూరిజంగా అభివృద్ధి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. టెంపుల్, ఎకో టూరిజంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలంగాణలో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయన్నారు. రామప్ప, వేయి స్తంభాల గుడి లాంటి ప్రపంచ ప్రఖ్యాత మందిరాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో టెంపుల్, ఎకో టూరిజం వెనకబడుతోందని టూరిజం పాలసీ తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు.

Similar News

News February 8, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> కుందారంలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
> ముగ్గురు పిల్లలు ఉన్నవారికి స్థానిక ఎన్నికల్లో అవకాశం కల్పించాలని గాంధీ నాయక్ ఆమరణ నిరాహార దీక్ష
> పలు గ్రామాల్లో బీఆర్ఎస్ నేతల సన్నాహక సమావేశం
> కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి ఎర్రబెల్లి అనుచరుడు
> టాప్ ర్యాంకే లక్ష్యంగా జిల్లాలో ‘విజయోస్తూ’ కార్యక్రమం
> సేవాలాల్ జయంతికి డీసీపీకి ఆహ్వానం

News February 8, 2025

ఢిల్లీ నుంచి గల్లీకి చేరిన కేజ్రీవాల్

image

నిన్నటివరకు మోదీకి ఎదురునిలిచే నేతల్లో కేజ్రీవాల్ ఒకరు. ప్రస్తుతం మాత్రం ఆప్‌తో పాటు తానూ ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో పరిస్థితి తలకిందులుగా మారింది. పంజాబ్‌లో అధికారంతో పాటు పలురాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు గెలిచి జోరుమీదున్న ఆప్‌కు ఢిల్లీ ఓటమి కోలుకోలేని దెబ్బ. లిక్కర్ స్కాం,శీశ్‌మహాల్, యమున నది కలుషితం తదితర అంశాలతో పాటు సొంత పార్టీ నేతల్లో వ్యతిరేకత తదితర అంశాలు కేజ్రీవాల్ ఓటమికి కారణమయ్యాయి.

News February 8, 2025

తిరుపతి: హోటల్ గ్రాండ్ రిడ్జ్‌కు బాంబు బెదిరింపులు

image

తిరుపతిలోని హోటల్ గ్రాండ్ రిడ్జ్‌కు శనివారం బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు యాజమాన్యం తెలిపింది. ‘అచ్చి ముత్తు సవుక్కు శంకర్’ అనే పేరుతో వచ్చిన మెయిల్ చూసిన మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

error: Content is protected !!