News April 15, 2025
వికారాబాద్‌లో ఈనెల 17న జాబ్ మేళా

ఈ నెల 17న వికారబాద్ ఐటీఐ క్యాంపస్‌లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి కల్పన అధికారి షేక్ అబ్దుల్ సుభాన్ తెలిపారు. మ్యాక్స్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగాలు పొందుటకు 10వ తరగతి ఆ పైన చదివిన వారు అర్హులు అన్నారు. వయసు 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఉండాలని, ఆసక్తి గలవారు జాబ్ మేళాలో పాల్గొనాలని సూచించారు.
Similar News
News November 7, 2025
సుధీర్ బాబు ‘జటాధర’ సినిమా రివ్యూ

లంకె బిందెలకు కాపలా ఉండే ధన పిశాచి, ఓ ఘోస్ట్ హంటర్ చుట్టూ జరిగే కథే ‘జటాధర’ మూవీ. ఆడియన్స్ పేషన్స్‌ను టెస్ట్ చేసే సినిమా ఇది. స్టోరీలో బలం, కొత్త ధనం లేదు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఏమాత్రం మెప్పించదు. అక్కడక్కడా కొన్ని థ్రిల్లింగ్ అంశాలు, BGM ఫర్వాలేదనిపిస్తాయి. హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్ ఇబ్బందిపెడుతుంది. సాగదీత, ఊహకు అందే సీన్లు, రొటీన్ క్లైమాక్స్ నిరాశకు గురిచేస్తాయి. రేటింగ్: 1/5
News November 7, 2025
మల్యాల: ‘రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి’

మల్యాల మం. రామన్నపేట, పోతారం, రాజారం గ్రామాల ప్యాడీ కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ B.S.లత పరిశీలించారు. కేంద్రాల్లో తూకపు, తేమ యంత్రాలు, టార్పాలిన్లు, క్లీనర్స్ అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా సదుపాయాలు కల్పించాలని సూచించారు. A గ్రేడ్‌కు రూ.2389, B గ్రేడ్‌కు రూ.2369 మద్దతు ధర అని తెలిపారు. ఇబ్బందులు ఎదురైతే టోల్ ఫ్రీ నంబర్ 18004258187ను సంప్రదించాలన్నారు.
News November 7, 2025
క్షమాపణలు చెప్పిన రిలయన్స్, స్కోడా.. ఎందుకంటే?

ఏదైనా భారీ తప్పిదం జరిగినప్పుడు కంపెనీలు తమ కస్టమర్లకు క్షమాపణలు చెప్పడం సహజమే. కానీ ఒకేసారి పలు కంపెనీలు బహిరంగంగా క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమవుతోంది. అయితే సరికొత్త సోషల్ మీడియా మార్కెటింగ్ ట్రెండ్‌ను ఫాలో అవుతూ సరదాగా ట్వీట్ చేశాయా కంపెనీలు. ‘నాణ్యమైనవి చౌకగా ఇస్తున్నందుకు’ రిలయన్స్, సేఫ్టీలో కాంప్రమైజ్ కానందుకు స్కోడా & ఫోక్స్ వాగన్ కంపెనీలు క్షమాపణలు చెప్పాయి.


