News January 23, 2025
వికారాబాద్లో దివ్యాంగులకు సబ్సిడీ రుణాలు

అర్హులైన దివ్యాంగులు సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ కృష్ణవేణి సూచించారు. దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా వారి పునరావాస పథకం కింద బ్యాంకు లింకేజీ లేకుండా నేరుగా రూ.50,000 సబ్సిడీ ఇస్తున్నారు. 24 యూనిట్లు ద్వారా రూ.12 లక్షల సబ్సిడీ మంజూరైంది. నేటి నుంచి ఫిబ్రవరి 2 వరకు అర్హులైన దివ్యాంగులు www.tg.obmms.cgg.gov.in ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News October 16, 2025
WWC25: సెమీ ఫైనల్కు ఆస్ట్రేలియా

ఉమెన్స్ ODI WC-2025లో సెమీ ఫైనల్ చేరిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. ఇవాళ బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచులో 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత BAN 198/9 స్కోర్ చేయగా, AUS 24.5 ఓవర్లలోనే టార్గెట్ను ఛేదించింది. అలీసా హీలీ(113) సెంచరీతో మెరిశారు. లిచ్ఫీల్డ్(84) హాఫ్ సెంచరీ చేశారు. ఈ ఇన్నింగ్స్లో హీలీ 20 ఫోర్లు బాదడం విశేషం. కాగా భారత్పై మ్యాచులోనూ హీలీ(142) అద్భుత సెంచరీ చేశారు.
News October 16, 2025
సంగారెడ్డి: ‘రేపటి నుంచి పాఠశాలలో స్వచ్ఛత పక్వాడ’

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో రేపటి నుంచి ఈనెల 31 వరకు స్వచ్ఛత పక్వాడ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. రోజు ఒక కార్యక్రమం నిర్వహించాలని దీనికి సంబంధించిన షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విడుదల చేశారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అందరూ ప్రధానోపాధ్యాయులు గమనించాలని సూచించారు.
News October 16, 2025
8th పే కమిషన్ సిఫార్సులు మరింత ఆలస్యం!

కేంద్ర ప్రభుత్వ 8th పే కమిషన్ సిఫార్సులు ఆలస్యం కావొచ్చు. కమిషన్ను కేంద్రం JANలో ప్రకటించినా విధివిధానాలు తేల్చలేదు. పదేళ్లకోసారి ఉద్యోగుల జీతాలు సవరించాలి. 7th పే కమిషన్ 2014లో ఏర్పాటు కాగా సిఫార్సులు 2016లో అమల్లోకొచ్చాయి. ప్రస్తుత కమిషన్ సిఫార్సులు 2026లో అమల్లోకి రావాలి. కానీ 2027లో కూడా అమలు కాకపోవచ్చని ‘కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్’ పేర్కొంది. ఫిట్మెంటు 1.8xగా ఉండొచ్చని అంచనా వేసింది.