News March 1, 2025
వికారాబాద్లో పోలీస్ను ఢీకొట్టిన బైకర్ (PHOTO)

తనిఖీల్లో పోలీస్నే ఢీకొట్టాడు ఓ బైకర్. వికారాబాద్ నుంచి దన్నారం రూట్లోని కట్టెల మిషన్ వద్ద రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు. ఈ సమయంలో ఓ బైకర్ పోలీసుల మీదకు దూసుకొచ్చాడు. తాగి దొరికిపోతానని గ్రహించిన బైకర్ ఇలా రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. అడ్డుకోవడానికి ప్రయత్నించిన హోంగార్డు కృష్ణను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో హోంగార్డు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Similar News
News March 1, 2025
టన్నెల్ ఘటన.. మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు

TG: శ్రీశైలం SLBC టన్నెల్ పైకప్పు కూలిన ఘటనలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. టీబీఎం(టన్నెల్ బోరింగ్ మెషీన్)ను కట్ చేస్తున్నారని, మనుషులు ఉన్నట్లుగా ఆనవాళ్లు ఉన్నచోట తవ్వకాలు జరుగుతున్నాయని వెల్లడించారు. నలుగురు సిబ్బంది TBM కింద ఉన్నట్లు తెలుస్తోందని చెప్పారు. పనులు వేగంగా జరగడం లేదని విమర్శించే వారు లోపలికి వెళ్లి చూస్తే పరిస్థితి అర్థం అవుతుందన్నారు.
News March 1, 2025
సంపద సృష్టిపై నిత్యం ఆలోచిస్తున్నా: సీఎం

AP: కూటమి అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే 12.9% వృద్ధి రేటు సాధించామని CM చంద్రబాబు తెలిపారు. YCP హయాంలో రోడ్లన్నీ గుంతలమయమైతే తాము మరమ్మతులు చేశామన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. సంపద ఎలా సృష్టించాలనే దానిపై నిత్యం ఆలోచిస్తున్నామని పునరుద్ఘాటించారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ద్వారా పేదల జీవితాల్లో మార్పులు తెస్తామని చెప్పారు.
News March 1, 2025
పేదరికం నుంచి బయటకు తీసుకురావడమే లక్ష్యం: కలెక్టర్

ఆర్థికంగా అత్యంత వెనుక బడిన కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. శనివారం కలెక్టరేట్ నుంచి వీక్షణ సమావేశం ద్వారా జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, తహశీల్దార్లకు ఆయన పేదరిక నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ లక్ష్యాల మేరకు అధికారులు పనిచేయాలని ఆయన సూచించారు.