News April 15, 2025
వికారాబాద్లో భారీగా పెరిగిన ధరలు

వికారాబాద్ జిల్లాలో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గత వారం KG చికెన్ రూ. 200 వరకు అమ్మకాలు జరిగాయి. మంగళవారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. హోల్ సేల్ దుకాణాల్లో విత్ స్కిన్ KG రూ. 123, స్కిన్ లెస్ KG రూ. 243గా ధర నిర్ణయించారు. రిటైల్ షాపుల్లో రూ. 220 నుంచి రూ. 260 మధ్యన అమ్ముతున్నారు. తాండూర్, కొడంగల్, పరిగి, వికారాబాద్ నియోజకవర్గాల్లో ధరలు ఏ విధంగా ఉన్నాయి. కామెంట్ చేయండి?
Similar News
News December 8, 2025
వెబ్సైట్లో కోటి ఎకరాల నిషేధిత భూముల జాబితా

TG: 22A జాబితాలోని నిషేధిత భూముల వివరాలు అందుబాటులోకి వచ్చాయి. స్టాంప్స్&రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లో వీటిని అప్లోడ్ చేసింది. GOVT, ఎండోమెంటు, అటవీ, ఇరిగేషన్, పేదలకు కేటాయించిన 77 లక్షల ACERS ఈ జాబితాలో ఉన్నాయి. మరో 20L ఎకరాలకు పైగా పట్టాదారుల భూమి ఉంది. ముందుగా వీటిని పరిశీలించి భూములు కొనుగోలు చేయొచ్చు. కాగా RR, MDK, సంగారెడ్డి(D)లలో కొన్ని ఖరీదైన భూములను న్యాయ వివాదాలతో జాబితాలో చేర్చలేదు.
News December 8, 2025
కృష్ణా: 880 ఉద్యోగాల భర్తీకై ఈ నెల 12న జాబ్ మేళా

APSSDC ఆధ్వర్యంలో మచిలీపట్నం SSR డిగ్రీ కళాశాలలో ఈ నెల 12న జాబ్ మేళా జరగనుంది. 13 కంపెనీలు హాజరయ్యే ఈ జాబ్ మేళాకు SSC, ఇంటర్, డిగ్రీ, ITI, డిప్లొమా, పీజీ, బీటెక్ చదివిన 18- 40 ఏళ్లలోపు వయస్సున్న అభ్యర్థులు హాజరు కావొచ్చని నిర్వాహకులు తెలిపారు. అభ్యర్థులు https://naipunyam.ap.gov.in/user-registrationలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఎంపికైనవారికి నెలకు 12- 25 వేల వేతనం ఉంటుందన్నారు.
News December 8, 2025
ప.గో జిల్లా కీలక నేత వైసీపీకి ‘బై’

తాడేపల్లిగూడేనికి చెందిన వైసీపీ ఎస్టీ విభాగం జిల్లా మాజీ అధ్యక్షుడు కావాడి శివ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రసాద్ రాజుకు అందజేసినట్లు సోమవారం తెలిపారు. పార్టీ కార్యక్రమాల సమాచారం ఇవ్వకపోవడం, తగిన గుర్తింపు లేకపోవడం వంటి కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తు కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానన్నారు.


