News February 26, 2025
వికారాబాద్లో మంగళవారం నాటి ముఖ్యాంశాలు

✓వికారాబాద్: 10వ తరగతి పరీక్షలకు పకడ్బందీ చర్యలు: కలెక్టర్. ✓లగచర్ల రైతులు ఇండస్ట్రియల్ పార్కుకు సహకరిస్తున్నారు: కలెక్టర్. ✓బషీరాబాద్: తల్లి, కొడుకు ఆత్మహత్య. ✓పరిగి: తండ్రిని కర్రతో కొట్టి చంపిన కొడుకు. ✓మహా కుంభమేళాలో ప్రభుత్వ చీఫ్ విఫ్ పట్నం మహేందర్ రెడ్డి ఫ్యామిలీ. ✓తాండూర్: శరవేగంగా రైల్వేస్టేషన్లో సుందరీకరణ: జీఎం అరుణ్ కుమార్ జైన్. ✓కొడంగల్: మహాశివరాత్రికి ముస్తాబైన శివాలయాలు.
Similar News
News November 27, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2,268 పోలింగ్ కేంద్రాలు

జిల్లాలో పంచాయతీ ఎన్నికల కోసం 260 పంచాయతీల్లో 2,268 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలి విడత ఎన్నికలు జరిగే రుద్రంగి, వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్, కోనరావుపేట, చందుర్తి మండలాలలో 85, 2వ దశ ఎన్నికలు నిర్వహించే బోయినపల్లి, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లో 88, 3వ విడత ఎన్నికలు జరిగే ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్, గంభీరావుపేట మండలాలలో 87 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
News November 27, 2025
పల్నాడు బీజేపీలో గందరగోళం..!

బీజేపీలో నియోజకవర్గ కన్వీనర్లను రద్దు చేస్తూ గతంలోనే పార్టీ పెద్దలు ఆదేశాలిచ్చారు. అయితే బుధవారం గురజాలలో కొందరు నేతలు సమావేశమై తాము సత్తెనపల్లి, గురజాల సహా ఐదు నియోజకవర్గాలకు కన్వీనర్లమంటూ ప్రకటించుకున్నారు. దీనిపై పల్నాడు జిల్లా అధ్యక్షుడు శశి కుమార్ తీవ్రంగా ఖండించారు. పార్టీలో కన్వీనర్ పదవులు లేవని స్పష్టం చేశారు.
News November 27, 2025
క్వాలిఫైయింగ్ పరీక్షలను పర్యవేక్షించిన ఎస్పీ స్నేహ మెహ్రా

ఏఆర్ఎస్ఐలకు ఆర్ఎస్ఐలుగా పదోన్నతి కల్పించేందుకు నిర్వహించిన డిపార్ట్మెంటల్ క్వాలిఫైయింగ్ పరీక్షలను జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా గురువారం ఉదయం పర్యవేక్షించారు. మల్టీ జోన్-II పరిధిలో ఏర్పాటు చేసిన ఈ పరీక్షల్లో భాగంగా ఏఆర్ఎస్ఐలకు సంబంధించిన శారీరక సామర్థ్య కార్యక్రమాన్ని ఆమె స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ తీరుపై ఎస్పీ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.


