News February 19, 2025
వికారాబాద్లో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

వికారాబాద్లో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. RTO ఆఫీస్ వద్ద ఆటో, కారు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఒకరు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. వికారాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 25, 2026
27న వైవీయూలో జాబ్ మేళా: ప్రిన్సిపల్

కడప YVUలో ఈ నెల 27వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ ప్రిన్సిపల్ ప్రొ. టి. శ్రీనివాస్ తెలిపారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, వైవీయు ప్లేస్మెంట్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగ ఎంపికలు నిర్వహిస్తున్నామన్నారు. 13 కంపెనీలు విశ్వవిద్యాలయానికి వస్తున్నాయన్నారు. టెన్త్ నుంచి పీజీ చదివిన వారు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు 6300125455, 94405 16153 నంబర్లను సంప్రదించాలన్నారు.
News February 25, 2026
శ్రీరంగపురం: సంతానం లేనివారు గరుడ ప్రసాదం తీసుకోండి- వేద పండితులు

శ్రీరంగాపురం మండల కేంద్రంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో గురువారం ధ్వజారోహణం జరుగుతోందని ఆలయ అర్చకులు తెలిపారు. గురువారం ఉదయం జరగబోవు ధ్వజారోహణంలో భాగంగా గరుడ ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందన్నారు. సంతానం లేని దంపతులు ఈ గరుడ ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతానం కలుగుతోందని వేద పండితులు చెబుతున్నారు. ప్రసాదం తీసుకునేవారు గురువారం ఉదయం 10 గంటలకు ఆలయానికి రావాలని కోరారు.
News February 25, 2026
రేపటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

AP: సాలకట్ల తెప్పోత్సవాలకు శ్రీవారి పుష్కరిణి విద్యుత్ కాంతులతో సుందరంగా ముస్తాబైంది. అధికారులు ప్రత్యేక అలంకరణలతో పుష్కరిణిని శోభాయమానంగా తీర్చిదిద్దారు. రేపు సాయంత్రం తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభంకానున్నట్లు TTD అధికారులు తెలిపారు. మార్చి 2 వరకు కొనసాగనున్న ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో 5 రోజుల పాటు సహస్రదీపాలంకార సేవ సహా పలు ఆర్జిత సేవలు రద్దయ్యాయి.


