News November 12, 2024

వికారాబాద్‌లో హైటెన్షన్!

image

వికారాబాద్ జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. కలెక్టర్ ప్రతీక్ జైన్, కడా ప్రత్యేక అధికారిపై దాడిని వ్యతిరేకిస్తూ ఓ వైపు కలెక్టరేట్‌ ఎదుట ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు లగచర్లలో పోలీసులు భారీగా మోహరించారు. దాడి వెనుక BRS హస్తం ఉందని HYD వేదికగా కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించాయి. ఈ తరుణంలో గ్రామస్థుల అరెస్ట్‌లకు నిరసనగా BRS నేతలు వికారాబాద్‌ బయల్దేరారు. ఈ వ్యవహారం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.

Similar News

News October 19, 2025

లేగదూడను చూసి CM మురిసే!

image

యాదవుల సదర్ అంటే CM‌ రేవంత్ రెడ్డికి మక్కువ అని చెప్పడానికి ఈ ఫొటో చక్కటి ఉదాహరణ. NTR స్టేడియం వద్ద నిర్వహించిన సదర్‌లో రేవంత్ ఏ ఒక్కరినీ నిరాశ పర్చలేదు. కళాకారుల నుంచి యువత వరకు అందరినీ పలకరించారు. యాదవ సోదరులతో ఫొటోలు దిగి సంభాషించారు. వేదిక ఎక్కిన తర్వాత అందంగా అలంకరించిన ఓ లేగదూడను చూసి ఆయన ముగ్ధుడయ్యారు. ఆ దూడెను తన దగ్గరకు తీసుకోవడం సదర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

News October 19, 2025

CM రాక.. బోనంతో స్వాగతం

image

ఎన్టీఆర్ స్టేడియం వద్ద శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్‌‌ ఆదివారం వైభవంగా సాగింది. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఈ వేడుకలో CM రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లోయర్‌ ట్యాంక్‌బండ్‌ నుంచి ధర్నాచౌక్‌ ప్రాంగణానికి చేరుకున్న ఆయన కాన్వాయ్‌ డోర్ ఓపెన్ చేసి మహిళా కళాకారులకు అభివాదం చేశారు. నెత్తిన బోనం ఎత్తుకొని నృత్యాలు చేస్తున్న కళాకారుల్లో CMని చూసి ఉత్సాహం మరింత పెరిగింది.

News October 19, 2025

యాదవుల సహకారంతోనే తెలంగాణ అభివృద్ధి: సీఎం రేవంత్ రెడ్డి

image

యాదవ సోదరుల ప్రత్యేకత వారి నమ్మకం, విశ్వాసం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ స్టేడియం వద్ద జరిగిన శ్రీకృష్ణ సదర్ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన వేదిక మీద మాట్లాడారు. ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా అండగా నిలబడే తత్వం యాదవ సోదరులదని కొనియాడారు. యాదవుల సహకారంతోనే తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు సదర్, దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.