News March 17, 2025

వికారాబాద్‌లో NCCని ఏర్పాటు చేయండి: ఎంపీ

image

వికారాబాద్‌లో NCC యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్‌కు చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మారుమూల ప్రాంతమైన తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్, చేవెళ్ల నియోజకవర్గ విద్యార్థిని, విద్యార్థులకు NCC యూనిట్‌ను వికారాబాద్‌లో ఏర్పాటు చేయడం వల్ల ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో కూడా రిజర్వేషన్ పొందే అవకాశం ఉంటుందన్నారు.

Similar News

News March 18, 2025

విశాఖ: టీడీపీలోకి వైసీపీ కార్పొరేటర్లు?

image

విశాఖలో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలే పరిస్థితి కనిపిస్తోంది. పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు అమరావతి చేరుకున్నట్లు సమాచారం. కార్పొరేషన్‌లో బలం పెరిగాక మేయర్‌పై అవిశ్వాసం పెట్టే యోచనలో కూటమి ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల చేరికపై మరికొద్ది గంటల్లో స్పష్టత రానుంది.

News March 18, 2025

వైసీపీకి షాక్: వైజాగ్ మేయర్‌పై అవిశ్వాసం?

image

AP: విశాఖ నగరపాలకసంస్థలోని వైసీపీకి చెందిన 9 మంది కార్పొరేటర్లు కాసేపట్లో టీడీపీ, జనసేన పార్టీల్లో చేరనున్నారు. ఇందుకోసం వారు అమరావతి చేరుకున్నారు. వీరితో కలుపుకొని జీవీఎంసీలో కూటమి సభ్యుల బలం 75కు చేరనుంది. అనంతరం జీవీఎంసీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కూటమి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం GVMCలో 97 మంది కార్పొరేటర్లు ఉన్నారు.

News March 18, 2025

తిరుగు ప్రయాణం మొదలు

image

అంతరిక్ష కేంద్రం నుంచి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ల తిరుగు ప్రయాణం ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం గం.10.36ని.లకు ISS నుంచి స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సుల్ సపరేట్ అయింది. దీంతో భూమ్మీదకు వారి ప్రయాణం ప్రారంభమైంది. రేపు భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున గం.3:27కు ఫ్లోరిడా తీర జలాల్లో ల్యాండ్ కానుంది.

error: Content is protected !!