News March 29, 2025
వికారాబాద్: అగ్నివీర్‌కు ఇద్దరు విద్యార్థులు ఎంపిక

వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల పరిధిలోని మదనంతాపూర్ గ్రామానికి చెందిన అరవింద్, మంబాపూర్ గ్రామానికి చెందిన అరుణ్ కుమారులు అగ్నివీర్ కు ఎంపికయ్యారు. మండలం నుంచి ఈ ఏడాది ఇద్దరు ఎంపిక కావడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇరువురు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులే కావడం గమనార్హం.
Similar News
News February 23, 2026
డయేరియా అదుపునకు అత్యవసర చికిత్స అందించాలి: రామ్మోహన్

శ్రీకాకుళంలో డయారేయా కేసుల ఉద్ధృతిపై జిల్లా అధికారులతో మాట్లాడిన కేంద్రమంత్రి రామ్మోహన్ సోమవారం అత్యవసరంగా సమీక్షించారు. రోగులకు అత్యవసర చికిత్స అందించి, వ్యాధి ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వ్యాధి సోకడానికి గల కారణాలు అన్వేషించాలని ఆయన సూచించారు. నగరపాలక సంస్థ ప్రజారోగ్య సిబ్బంది, అధికారులు క్షేత్ర స్థాయిలో నిరంతరo అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
News February 23, 2026
ఉగ్రవాదంపై ఉక్కుపాదం.. ‘ప్రహార్’ పాలసీని ఆవిష్కరించిన కేంద్రం!

ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు కౌంటర్ టెర్రరిజం పాలసీ ‘ప్రహార్’ను కేంద్రం ఆవిష్కరించింది. సరిహద్దుల్లోని జిహాదీ నెట్‌వర్క్‌లు, సైబర్ దాడులు, డ్రోన్ ఆధారిత స్మగ్లింగ్, క్రిప్టోకరెన్సీ, జీవ&అణు పదార్థాల దుర్వినియోగం, సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ పాలసీని రూపొందించింది. టెర్రర్ దాడులను ఆపేందుకు మల్టీ ఏజెన్సీలను వినియోగించనుంది. ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాయింట్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనుంది.
News February 23, 2026
కరీంనగర్ పోలీస్ డాగ్ ‘టైసన్’కు స్వర్ణ పతకం

కరీంనగర్ పోలీస్ విభాగానికి చెందిన పోలీస్ డాగ్ ‘టైసన్’ రాష్ట్ర స్థాయిలో ఘనత చాటింది. హైదరాబాద్ మొయినాబాద్‌లోని ఐ.ఐ.టి.ఏ (IITA) శిక్షణ కేంద్రంలో జరిగిన 24వ బ్యాచ్ ముగింపు వేడుకల్లో ఎక్స్‌ప్లోజివ్ (పేలుడు పదార్థాల గుర్తింపు) విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు గాను గోల్డ్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా టైసన్‌ను, దాని హ్యాండ్లర్ పి.సి. ఇ. రాజును పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు.


