News March 14, 2025
వికారాబాద్: అడవి పంది.. వ్యక్తి ప్రాణం తీసింది..!

అడవి పందిని తప్పించబోయి బైక్పై నుంచి పడి వ్యక్తి మృతిచెందిన ఘటన వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం రాఘవపూర్ శివారులో చోటుచేసుకుంది. మృతిచెందిన వ్యక్తి బొంరాస్పేట్ మండలం మెట్లకుంటకు చెందిన కావాలి సుధాకర్గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 17, 2025
చిన్నతనంలో ఊబకాయం రాకూడదంటే..!

చిన్నారుల్లో ఊబకాయం రాకూడదంటే శారీరక, మానసిక అభివృద్ధికి అవసరమైన పోషకాలున్న ఆహారం ఇవ్వాలి. పిల్లలు ఔట్ డోర్ గేమ్స్ ఆడేలా ప్రోత్సహించాలి. తగినంత నిద్ర లేకపోవడం వల్ల కూడా పిల్లలు బరువు పెరగవచ్చు. పిల్లలు ప్రతిరోజూ కనీసం 8-9 గంటలు నిద్రపోయేలా టైమ్ టేబుల్ సెట్ చేయండి. పిల్లల్లో ఊబకాయాన్ని నివారించడానికి, స్క్రీన్ సమయాన్ని తగ్గించడం కూడా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
News December 17, 2025
మూడో నేత్రం తెరుద్దామా?

శివుడికే కాదు మనక్కూడా 3 నేత్రాలు ఉంటాయి. నుదిటిపై కుంకుమ ధరించడం వల్ల ఆ నేత్రాన్ని తెరవొచ్చని పండితులు చెబుతున్నారు. ‘మన శరీరంలో 7 శక్తి చక్రాలు ఉంటాయి. అందులో మూడోది నుదిటిపై ఉంటుంది. అక్కడ కుంకుమ ధరిస్తే మూడో చక్రం ఉత్తేజితమవుతుంది. అది మన ఆత్మ శక్తిని పెంచుతుంది. అయితే అమ్మాయిలు ప్లాస్టిక్తో చేసిన కృత్రిమ బిందీ పెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవట. పాజిటివ్ ఎనర్జీకై సహజ కుంకుమను వాడుదాం.
News December 17, 2025
కోనసీమ: ఏడాది పాటు రుసుము రద్దు.. అప్డేట్ చేసుకోండి

5 నుంచి 17 ఏళ్లలోపు విద్యార్థులు తప్పనిసరిగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని అంబేడ్కర్ కోనసీమ కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. మంగళవారం ఆయన అమలాపురం కలెక్టరేట్లో మాట్లాడారు. కేంద్ర నిబంధనల మేరకు ఈ సేవలకు సంబంధించిన రుసుమును ఏడాది పాటు పూర్తిగా రద్దు చేసినట్లు వెల్లడించారు. విద్యాసంస్థలు ఈ విషయంపై శ్రద్ధ వహించి, విద్యార్థులందరితో అప్డేట్ చేయించాలని ఆదేశించారు.


