News March 14, 2025
వికారాబాద్: అడవి పంది.. వ్యక్తి ప్రాణం తీసింది..!

అడవి పందిని తప్పించబోయి బైక్‌పై నుంచి పడి వ్యక్తి మృతిచెందిన ఘటన వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం రాఘవపూర్ శివారులో చోటుచేసుకుంది. మృతిచెందిన వ్యక్తి బొంరాస్‌పేట్ మండలం మెట్లకుంటకు చెందిన కావాలి సుధాకర్‌గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 25, 2025
శ్రీరామ నవమికి ముస్తాబవుతున్న అయోధ్య

అత్యంత వైభవంగా జరిగే శ్రీరామ నవమి వేడుకలకు అయోధ్య ముస్తాబవుతోంది. ఏప్రిల్ 6న జరిగే శ్రీరాముని కళ్యాణ మహోత్సవాన్ని భక్తులందరూ వీక్షించేలా నగరం మెుత్తం భారీ LED స్క్రీన్లను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. ఆశ్రమాలలో వసతి సౌకర్యం కల్పించనున్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్వామివారి కళ్యాణాన్ని దేశవ్యాప్తంగా తిలకించేలా లైవ్ టెలికాస్ట్ చేయనున్నట్లు పేర్కొన్నారు.
News March 25, 2025
NRML: నేటితో ముగియనున్న డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు నేటితో ముగుస్తుందని అధికారులు తెలిపారు. విద్యార్థులు త్వరగా ఫీజు చెల్లించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ అపార్ ఐడీని ఆధార్ కార్డ్ జిరాక్స్‌ను కళాశాలల్లో ఇచ్చి లింక్ చేసుకోవాలని పేర్కొన్నారు.
News March 25, 2025
నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి: డీకే అరుణ

హైదరాబాద్‌లో 23 ఏళ్ల యువతి వేధింపుల నుంచి తప్పించుకునేందుకు కదులుతున్న ఎంఎంటీఎస్ రైలు నుంచి దూకి గాయాల పాలైందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. నగరంలో మహిళల భద్రతను మెరుగుపరచాల్సిన తక్షణ అవసరాన్ని ఈ సంఘటన ఎత్తి చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు