News February 5, 2025
వికారాబాద్: అదనపు కట్నం వేధింపులు.. సూసైడ్

వికారాబాద్లో <<15357920>>నవ వధువు సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక సాకేత్ నగర్కు చెందిన సాయికి సంగారెడ్డి జిల్లా మునిపల్లికి చెందన శ్రీజతో గతేడాది నవంబర్లో పెళ్లైంది. ఇంతలో అదనపు కట్నం కోసం భర్త వేధించ సాగాడు. ఇప్పుడు డబ్బులు ఇచ్చే స్థితిలో మా వాళ్లు లేరని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా భర్త వినలేదు. దీంతో విషయం కుటుంబీకులు ఫోన్లో చెప్పిన శ్రీజ అనంతరం ఇంట్లో ఉరేసుకుంది.
Similar News
News December 1, 2025
ఖమ్మం: గుర్తుల పంచాయితీ!

పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులుండవు. సర్పంచ్కు గులాబీ రంగు, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు కీలకం కానున్నాయి. సర్పంచ్ గుర్తుల్లో ఉంగరం, కత్తెర బాగానే ఉన్నా, బ్యాట్, టీవీ రిమోట్లు, సాసర్, పలక, బ్లాక్ బోర్డు వంటివి ఒకేలా ఉండటంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రచారం సరిగా చేయకపోతే ఓట్లు మారే ప్రమాదం ఉంది.
News December 1, 2025
KNR: గుర్తుల అల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం అభ్యర్థుల పేర్లు

సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో గుర్తుల కేటాయింపుపై అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఎన్నికల అధికారులు అభ్యర్థుల పేర్లు గుర్తుల అల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం కేటాయిస్తారు. కాగా ఓటర్లు ఈజీగా గుర్తుపట్టే గుర్తులిస్తే బాగుంటుందని, ఎక్కువగా వాడని గుర్తులు అలాట్ చేస్తే ఓటర్లు ఇబ్బంది పడే ఛాన్స్ ఉందని పలువురు చర్చిస్తున్నారు. ఐతే ఎక్కువమంది బరిలో ఉంటే అనువైన గుర్తులు రావని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
News December 1, 2025
ఖమ్మంలో ఎన్నికల వేడి.. ప్రత్యర్థులను తప్పించే ప్రయత్నాలు!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. తొలి విడత నామినేషన్లు పూర్తి కావడం, రెండో విడత ప్రారంభం కావడంతో గ్రామాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. తమ గెలుపుపై ప్రభావం చూపుతారని భావించిన కొందరు అభ్యర్థులు, డబ్బు లేదా ఇతర మార్గాల ద్వారా ప్రత్యర్థులను పోటీ నుంచి తప్పించే ప్రయత్నాల్లో శరవేగంగా నిమగ్నమయ్యారు.


