News February 5, 2025
వికారాబాద్: అదనపు కట్నం వేధింపులు.. సూసైడ్

వికారాబాద్‌లో <<15357920>>నవ వధువు సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక సాకేత్ నగర్‌కు చెందిన సాయికి సంగారెడ్డి జిల్లా మునిపల్లికి చెందన శ్రీజతో గతేడాది నవంబర్‌లో పెళ్లైంది. ఇంతలో అదనపు కట్నం కోసం భర్త వేధించ సాగాడు. ఇప్పుడు డబ్బులు ఇచ్చే స్థితిలో మా వాళ్లు లేరని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా భర్త వినలేదు. దీంతో విషయం కుటుంబీకులు ఫోన్‌లో చెప్పిన శ్రీజ అనంతరం ఇంట్లో ఉరేసుకుంది.
Similar News
News February 18, 2025
ప్రతీకారం తీర్చుకుంటా: షేక్‌హసీనా

ఆవామీలీగ్ కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటామని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రతిజ్ఞ చేశారు. ఆపార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశంలో జూమ్‌కాల్ ద్వారా హాజరయ్యారు. తాను త్వరలోనే బంగ్లాదేశ్‌కు వస్తానని అందరికీ న్యాయం చేస్తానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. విద్యార్థుల ఆందోళనలో ఎంతోమంది కళాకారులు, పోలీసులు, కార్యకర్తలు హత్యకు గురైనా యూనస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదని ఆరోపించారు.
News February 18, 2025
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో తప్పిన ప్రమాదం

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన బ్లూ డార్ట్ కార్గో విమానంలో ల్యాండింగ్ గేర్ సమస్య ఏర్పడింది. దీంతో రన్ వేపై అత్యవసర ల్యాండింగ్‌కు పైలెట్ అనుమతి కోరారు. అనంతరం కార్గో ఫ్లైట్ సేఫ్‌గా ల్యాండ్ అయింది. ఆ సమయంలో విమానంలో ఐదుగురు సిబ్బంది ఉన్నారు.
News February 18, 2025
శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న ఓ ప్రయాణికుడి కదలికలపై సీఐఎస్ఎఫ్ అధికారులకు అనుమానం రాగా అతడిని అదుపులోకి తీసుకొని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీంతో అతని వద్ద నుంచి 22 లక్షల విలువైన విదేశీ కరెన్సీ లభించింది. కరెన్సీని స్వాధీనం చేసుకున్న అధికారులు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.