News February 7, 2025

వికారాబాద్: అప్పుడే మండుతున్న ఎండలు

image

గత కొన్నిరోజులుగా వికారాబాద్ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న జిల్లాలో 35.2 డిగ్రీలు నమోదైంది.  ఫిబ్రవరి మొదటి వారంలోనే పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా రికార్డు అవుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే.. మునుముందు పరిస్థితి ఎలా ఉంటుందో అని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పొద్దున, సాయంత్రం వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ పగటి పుట ఉష్ణోగ్రతలు సుర్రుమంటున్నాయి. 

Similar News

News February 7, 2025

అనకాపల్లి: టీచర్‌పై పోక్సో కేసు నమోదు

image

బుచ్చయ్యపేట వడ్డాది ప్రైవేట్ స్కూల్లో విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్ గంగా ప్రసాద్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా శుక్రవారం తెలిపారు. అనంతరం నిందితుడిని చోడవరం కోర్టులో ప్రవేశ పెట్టగా 14 రోజులు రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో గుడ్ టచ్.. బ్యాడ్ టచ్‌పై అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు.

News February 7, 2025

8 నెలల్లో రూ.6,78,345 కోట్ల పెట్టుబడులు: TDP

image

AP: కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల కాలంలో సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కృషితో రాష్ట్రంలో చాలా కంపెనీలు పెట్టుబడులకు ముందుకొచ్చినట్లు టీడీపీ ట్వీట్ చేసింది. 34 ప్రాజెక్టుల ద్వారా రూ.6,78,345 కోట్ల పెట్టుబడులు వచ్చాయని స్పష్టం చేసింది. త్వరలో ఏర్పాటు కానున్న కంపెనీల్లో 4,28,705 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు పూర్తి వివరాలను వెల్లడించింది.

News February 7, 2025

పెద్దపల్లి: వారం రోజుల్లో బ్యాంకు గ్యారెంటీలు సమర్పించాలి: అదనపు కలెక్టర్

image

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ సంబంధించి ధాన్యం కేటాయింపులకు బ్యాంకు గ్యారంటీ లను వారం రోజులలో సమర్పించాలని అదనపు కలెక్టర్ డి.వేణు రైస్ మిల్లర్లను ఆదేశించారు.2024-25 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ సంబంధించి ధాన్యం కేటాయింపు కోసం 125 మంది రైస్ మిల్లర్లలో 15 మంది మాత్రమే బ్యాంకు గ్యారంటీలు సమర్పించారన్నారు. మిగిలిన రైస్ మిల్లర్లు వారం రోజులు బ్యాంకు గ్యారంటీలను సమర్పించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.

error: Content is protected !!