News February 6, 2025

వికారాబాద్: అర్హులకు ఇళ్లు మంజూరు చేస్తాం: అదనపు కలెక్టర్

image

అర్హులైన ప్రతి పేదవాడికి ఇళ్లు మంజూరు అయ్యేలా చర్యలు చేపడుతామని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విధి విధానాలపై హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ పి.వి.గౌతం, చీఫ్ ఇంజినీర్ చైతన్య కుమార్‌తో కలిసి జిల్లా అదనపు కలెక్టర్‌లు, హౌసింగ్ ఎంపిడిఓ, మున్సిపల్ కమిషనర్‌లకు పలు సూచనలు, సలహాలు చేశారు.

Similar News

News October 16, 2025

ఒకే హెలికాప్టర్‌లో శ్రీశైలం బయల్దేరిన మోదీ, CBN, పవన్

image

AP: రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రత్యేక విమానంలో కర్నూలు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. అనంతరం ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఒకే హెలికాప్టర్‌లో శ్రీశైలం వెళ్లారు. ముగ్గురూ కలిసి శ్రీశైల మల్లన్నను దర్శించుకోనున్నారు. ఆలయం వద్ద 1,500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

News October 16, 2025

KNR: పోలీసులకు లొంగిపోయిన మేటాఫండ్ నిర్వాహకుడు..?

image

ఉమ్మడి KNRలో మేటాఫండ్ మనీ సర్క్యూలేషన్ బిజినెస్ నిర్వహించిన HYDవాసి లోకేశ్ KNR పోలీసుల ముందు లొంగిపోయినట్లు సమాచారం. KNR, JGTLలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న లోకేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. రూ.లక్షకు రూ.3లక్షలు వస్తాయని నమ్మించి ఉమ్మడి జిల్లాలో మేటాఫండ్ పేరిట ట్రేడింగ్ చేసి రూ.వందల కోట్లు లోకేశ్ కొల్లగొట్టాడు. బాధితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, వ్యాపారస్థులు ఉన్నట్లు తెలుస్తోంది. SHARE

News October 16, 2025

రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం

image

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం రేపు సాయంత్రం 4 గంటలకు తెరుచుకోనుంది. నెలవారీ పూజల నిమిత్తం అర్చకులు రేపు గుడి తలుపులు తీసి, దీపాన్ని వెలిగిస్తారని ట్రావెన్‌కోర్ దేవస్థానం తెలిపింది. ఈనెల 18న ఉదయం 5 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని చెప్పింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటనలో భాగంగా అక్టోబర్ 22న దర్శన సమయాల్లో ఆంక్షలు ఉంటాయంది.