News February 6, 2025
వికారాబాద్: అర్హులకు ఇళ్లు మంజూరు చేస్తాం: అదనపు కలెక్టర్

అర్హులైన ప్రతి పేదవాడికి ఇళ్లు మంజూరు అయ్యేలా చర్యలు చేపడుతామని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విధి విధానాలపై హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ పి.వి.గౌతం, చీఫ్ ఇంజినీర్ చైతన్య కుమార్‌తో కలిసి జిల్లా అదనపు కలెక్టర్‌లు, హౌసింగ్ ఎంపిడిఓ, మున్సిపల్ కమిషనర్‌లకు పలు సూచనలు, సలహాలు చేశారు.
Similar News
News April 11, 2026
సింగర్ మంగ్లీపై కేసు నమోదు

ప్రముఖ సింగర్ మంగ్లీపై HYD పంజాగుట్ట PSలో కేసు నమోదైంది. మంగ్లీ, ఆమె సోదరుడు, మరికొంతమందితో కలిసి పెట్టుబడులు, అధిక లాభాల పేరుతో 100 మంది నుంచి రూ.10 కోట్ల మేర వసూలు చేసినట్లు బాధితులు ఆరోపించారు. న్యాయం కోరుతూ వారు లాయర్ సుబ్బారావును ఆశ్రయించారు. కాగా ఆ న్యాయవాదిని మంగ్లీ బృందం బెదిరించడంతో అతను PSలో ఫిర్యాదు చేశారు. దీంతో మంగ్లీ సహా సోదరుడు శివ, డైరెక్టర్ వేణు ఊడుగుల తదితరులపై కేసు నమోదైంది.
News April 11, 2026
గుంటూరు: సాఫ్ట్‌వేర్ ట్రైనర్ అదృశ్యం.. కేసు నమోదు

పల్నాడు (D) యడ్లపాడు (M) కొండవీడుకు చెందిన తోట హేమంత్ (24) కనిపించడం లేదు. బీటెక్ పూర్తి చేసి బ్రాడీపేటలో సాఫ్ట్‌వేర్ కోర్సు నేర్చుకుంటూ బాయ్స్ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈ నెల 2న సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్‌కు వెళ్తున్నానని చెప్పి హాస్టల్ నుంచి బ్యాగ్ తీసుకొని వెళ్లిన అతను ఇప్పటివరకు తిరిగి రాలేదు. అతని తండ్రి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 11, 2026
నిర్మల్: మొక్కజొన్న రైతులకు తప్పని తిప్పలు

నిర్మల్ జిల్లాలో మొక్కజొన్న సాగు విస్తారంగా ఉన్నా, కేవలం నిర్మల్, సారంగాపూర్ మండల కేంద్రాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పంటను అమ్ముకోవడానికి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. అన్ని మండలాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు కొనుగోళ్లు జరిపి తమ ఇబ్బందులను తీర్చాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


