News February 24, 2025
వికారాబాద్: ఆరు పాఠశాలల్లో ఏఐ విద్య: DEO

VKB జిల్లాలోని ఆరు పాఠశాలల్లో AI విద్యను అమలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పైలెట్ ప్రాజెక్టుగా 36 పాఠశాలల్లో అమలు చేస్తుండగా 6 పాఠశాలలు జిల్లాలో ఉన్నాయి. దోమ మండలంలోని బొంపల్లి, పరిగి మండలంలోని గడిసింగాపూర్, తాండూరులోని సాయిపూర్, కొడంగల్, కోట్పల్లి, VKB మండలంలోని పులుమద్ది పాఠశాలల్లో ఏఈ విద్యను అమలు చేయనున్నారు. ప్రతి ఒక్కరి కృషితో AI విద్యను అమలు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు DEO తెలిపారు.
Similar News
News February 24, 2025
కామారెడ్డి: CM రేవంత్ రెడ్డిని సన్మానించిన డీసీసీ అధ్యక్షుడు

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార నిమిత్తం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం నిజామాబాద్ పట్టణానికి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు పూలబొకేను ఇచ్చి ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, జిల్లా నాయకులు ఉన్నారు.
News February 24, 2025
సంగారెడ్డి: రంజాన్ మాసం కోసం అన్ని ఏర్పాట్లు చేయండి: కలెక్టర్

ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పట్టణాలు, గ్రామాల్లో శానిటేషన్ మెరుగ్గా ఉండేలా చూడాలని చెప్పారు. ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసే చోట్ల సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్పి రూపేష్, అధికారులు పాల్గొన్నారు.
News February 24, 2025
పారదర్శకంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు: కలెక్టర్

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పారదర్శకంగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఎమ్మెల్సీ పోలింగ్ విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. పీఓలు, ఏపీవోలు శిక్షణ తరగతులకు పలు సూచనలు చేశారు. ఈ నెల 27న చేపట్టే పోలింగ్ ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆకళింపు చేసుకొని ఎన్నికల విధులకు సంబంధించిన అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.