News March 14, 2025
వికారాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో కనీస వసతులు కల్పించాలి: సీపీఎం

వికారాబాద్ జిల్లాలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్‌లో కనీస వసతులు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్.మహిపాల్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా TGSRTC బస్టాండ్లల్లో ప్రయాణికులకు బాత్రూంలు, మంచినీళ్లు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆర్టీసీ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కనీస సౌకర్యాలు కల్పించడంతో పాటు బస్సుల సంఖ్య పెంచాలని మహిపాల్ కోరారు.
Similar News
News January 8, 2026
10pmకు రాజాసాబ్ ప్రీమియర్ షో.. అయితే!

TG: ప్రభాస్ ‘రాజాసాబ్’ ప్రీమియర్స్‌పై ఫ్యాన్స్‌కు నిరాశ తప్పేలా లేదు. ప్రీమియర్స్, టికెట్ రేట్ల పెంపుపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అనుమతి రాలేదు. దీంతో హైదరాబాద్‌లో ఓ ప్రీమియర్ షో వేయాలని మేకర్స్ నిర్ణయించారు. రాత్రి 10 గంటలకు బాలానగర్ విమల్ థియేటర్లో షో వేయనున్నారు. దీనికి కేవలం మీడియా ప్రతినిధులనే అనుమతిస్తున్నారు. అటు ఏపీలో మాత్రం ప్రీమియర్ షోలు ప్రారంభం అవుతున్నాయి.
News January 8, 2026
WGL: ‘స్ట్రామ్ వాటర్ డ్రైన్లను ప్రతిపాదించాలి’

వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో రూ.4170 కోట్లతో చేపట్టే అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సమాంతరంగా స్ట్రామ్ వాటర్ డ్రైన్లను ప్రతిపాదించాలని MLAలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, కేఆర్ నాగరాజు సూచించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థపై గురువారం జిడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి డీపీఆర్‌లపై సమీక్షించారు. ఈ సమీక్షలో బల్దియా ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
News January 8, 2026
PDPL: ‘RBSK సిబ్బంది సమయపాలన పాటించాలి’

DMHO డాక్టర్ ప్రమోద్ కుమార్ గురువారం RBSK డాక్టర్లు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. RBSK డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలని ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తామని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించి, రిఫరల్ కేసులు పెంచాలని ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించాలని తెలిపారు. డా. శ్రీరాములు, డా. కిరణ్ కుమార్ పాల్గొన్నారు.


