News March 14, 2025

వికారాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో కనీస వసతులు కల్పించాలి: సీపీఎం 

image

వికారాబాద్ జిల్లాలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్‌లో కనీస వసతులు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్.మహిపాల్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా TGSRTC బస్టాండ్‌లల్లో ప్రయాణికులకు బాత్రూంలు, మంచినీళ్లు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆర్టీసీ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కనీస సౌకర్యాలు కల్పించడంతో పాటు బస్సుల సంఖ్య పెంచాలని మహిపాల్ కోరారు.

Similar News

News April 22, 2025

‘భూ భారతి.. సకల సమస్యలకు పరిష్కార వేదిక’

image

భూ భారతి చట్టం రైతులకు చుట్టంలా సకల సమస్యలకు పరిష్కార వేదికగా ఉంటుందని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు. సోమవారం ఆలంపూర్లోని బీఆర్ఎస్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం-2025పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయుడు, కలెక్టర్ బి.యం సంతోష్‌తో కలిసి పాల్గొన్నారు. భూభారతి చట్టంపై, అందులోని అంశాలపై ఎంపీ వివరిస్తూ రైతులకు అవగాహన కల్పించారు.

News April 22, 2025

AMP: ఎస్పీ PGRS వేదికకు 30 ఫిర్యాదులు

image

అమలాపురంలో సోమవారం జిల్లా ఎస్పీ కృష్ణారావు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. 30 మంది తమ సమస్యలను ఎస్పీకి విన్నవించుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను చట్ట పరిధిలో విచారించి త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ సూచించారు. బాధితులకు న్యాయం చేయాలని చెప్పారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను తమ కార్యాలయానికి నివేదించాలన్నారు.

News April 22, 2025

పల్నాడు: ఏజెన్సీ నియామక ప్రక్రియ ప్రారంభించాలి- కలెక్టర్

image

జూన్ 1 నాటికి పల్నాడు జిల్లాలో 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను స్టాక్ పాయింట్లలో నిల్వ చేయాలని కలెక్టర్ అరుణ్ బాబు అధికారులను సోమవారం ఆదేశించారు. ఇసుక నిల్వ చేసేందుకు స్టాక్ పాయింట్లను గుర్తించాలన్నారు. అన్ని స్టాక్ పాయింట్లలో ఇసుక నిర్వహణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక రీచుల్లో ఏజెన్సీల నియామక ప్రక్రియను ప్రారంభించాలన్నారు

error: Content is protected !!