News April 12, 2025
వికారాబాద్: ఈనెల 8 నుంచి పోషణ పక్షోత్సవాలు

ఈనెల 8 నుంచి 22 వరకు నిర్వహించనున్న పోషణ పక్షోత్సవానికి సంబంధించిన బ్రోచర్‌ను వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోషణ పక్షోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు లింగ నాయక్, రవాణా శాఖ అధికారి వెంకట్ రెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్, డిపిఓ జయసుధ పాల్గొన్నారు.
Similar News
News December 19, 2025
దీన్‌దయాల్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

దీన్‌దయాల్ పోర్ట్ అథారిటీ 10 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు JAN 15వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు కాపీ, డాక్యుమెంట్స్‌ను JAN 27వరకు స్పీడ్ పోస్ట్ చేయాలి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE, B.Tech, B.LSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్సైట్: https://www.deendayalport.gov.in/
News December 19, 2025
ఆయిల్ పామ్ సాగులో ఇవి కీలకం

ఆయిల్ పామ్ సాగుకు నీటి సదుపాయం కీలకం. 2 అంగుళాల బోర్వెల్ ఉంటే మైక్రోఇరిగేషన్ ద్వారా రోజూ 2,3 గంటలు.. వేసవిలో 4,5 గంటలు నీరివ్వాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి నిపుణుల సూచనలతో ఎరువులు తప్పక వేయాలి. పంట దిగుబడికి ఫలదీకరణం కీలకం. అందుకే మొక్క నాటిన ఏడాదిన్నర నుంచి మూడేళ్ల వరకు వచ్చే పొత్తులను తీసేయాలి. దీని వల్ల మొక్క మాను బాగా వృద్ధిచెందుతుంది. భవిష్యత్తులో గెలలు నిండుగా వచ్చి బరువు పెరుగుతాయి.
News December 19, 2025
మద్దతు ధరతో కందులు, మినుములు, పెసర కొనుగోలు

AP: రాష్ట్రంలో పప్పు ధాన్యాలు పండించే రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. మద్దతు ధరపై(ఖరీఫ్ 2025-26) 1,16,690 మె.టన్నుల కందులు, 28,440 మె.టన్నుల మినుములు, 903 మె.టన్నుల పెసర కొనుగోలుకు అనుమతిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ లేఖ రాశారు. దీంతో క్వింటా కందులకు దాదాపు రూ.8000, మినుములకు రూ.8,110, పెసరకు రూ.8,768 అందనుంది.


